వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌తో ఠాకూర్లపై మండిపడుతున్న బ్రాహ్మణులు

అసలు ఠాకూర్‌ సామాజికవర్గమైన యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొబెట్టినప్పుడే చాలా మంది బ్రాహ్మణులు ముఖం మార్చుకున్నారు.

వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌తో ఠాకూర్లపై మండిపడుతున్న బ్రాహ్మణులు
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 11, 2020 | 3:40 PM

ఉత్తరప్రదేశ్‌లో కుల రాజకీయం అన్ని రాజకీయపక్షాలకు అచ్చొచ్చిన అంశం! కుల రాజకీయ ప్రయోగాలు సదా విజయం సాధిస్తూనే ఉంటాయక్కడ! గత పాతికేళ్లుగా అక్కడ సాగుతున్నవి అవే! ఇప్పుడు వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌తో మరోసారి కులాల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది.. మొదట్నుంచి అక్కడ ఠాకూర్లకు, బ్రాహ్మణులకు పడదు.. అసలు ఠాకూర్‌ సామాజికవర్గమైన యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొబెట్టినప్పుడే చాలా మంది బ్రాహ్మణులు ముఖం మార్చుకున్నారు.. ఇప్పుడు వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌తో బ్రాహ్మణ సామాజికవర్గం యోగిపై కారాలు మిరియాలు నూరుతోంది.. ఎన్‌కౌంటర్‌ చేసింది వికాస్‌దూబే అనే గ్యాంగ్‌స్టర్‌ను కాదని, బ్రాహ్మణ గౌరవ ప్రతిష్టలను అని సోషల్‌ మీడియాలో యూపీ బ్రాహ్మణ వర్గాలు మొత్తుకుంటున్నాయి. బ్రాహ్మణ సామాజికవర్గానికి అమితంగా ప్రేమించే, గౌరవించే పులిలాంటి వ్యక్తిగా వికాస్‌ దూబేను కీర్తిస్తున్నాయి. అక్కడితో ఆగకుండా పరుశురాముడి ప్రతినిధి అంటూ ప్రస్తావిస్తున్నాయి.

ఠాకూర్లపై మండిపడుతున్న బ్రాహ్మణ సామాజికవర్గం

వికాస్‌ దూబేను బూటకపు ఎన్‌కౌంటర్‌లో మట్టుపెట్టి బ్రాహ్మణులపై తమకున్న కసిని కోపాన్ని ఠాకూర్లు మరోసారి ప్రదర్శించారని ఆరోపిస్తున్నాయి. నిన్నటి నుంచి ఫేస్‌బుక్‌లో తామరతంపరగా పోస్టులు పెడుతున్నారు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన కొందరు. చంపింది వికాస్‌ దూబేను కాదని, బ్రాహ్మణుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని అని యోగి ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నారు. ‘మిశ్రాలు, పాండేలు, చౌబీలు, తివారీలు, భూమిహార్లు .. మీరంతా పరశురాముడు ఎవరిమీద పోరాటం సాగించారో గుర్తుకు తెచ్చుకోవాలి’ అంటూ వివమ్‌ బ్రాహ్మణ్‌ దాదా భాయ్‌ అనే ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో లైవ్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.. మీకు దమ్ముంటే వికాస్‌దూబే మీద సినిమా తీయండి.. థియేటర్లను కాల్చిపారేయ్యకపోతే అడగండి అటూ సవాల్‌ కూడా విసిరాడు.

సోషల్‌ మీడియాలో వెల్లువెత్తిన ఆగ్రహం

వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌ తర్వాత ఫేస్‌బుక్కే కాదు, వాట్సప్‌, ట్విట్టర్‌లలో కూడా ఇదే రకమైన రాతలు.. మొత్తంగా చూస్తే ఉత్తరప్రదేశ్‌లో ఠాకూర్స్‌ వర్సెస్‌ బ్రాహ్మిణ్స్‌ తగవు మళ్లీ మొదలయ్యిందనిపిస్తోంది.. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ బ్రాహ్మణ సామాజికవర్గాన్ని అస్సలు పట్టించుకోవడం లేదన్నది చాలా మంది బ్రాహ్మణుల కంప్లయింట్‌! వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌ను కేవలం కక్ష సాధింపు చర్యగానే చూస్తున్నారు ఉత్తరప్రదేశ్‌ బ్రాహ్మణులు. వికాస్‌దూబేను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు సోషల్ మీడియాలలో బ్రాహ్మణ సామాజికవర్గం స్పందన వేరే రకంగా ఉంది.. వారి ఆగ్రహం ముస్లింలవైపుకు మళ్లింది… దమ్ముంటే తబ్లిగి జమాత్‌ చీఫ్‌ మౌలానా సాద్‌ను కూడా అరెస్ట్‌ చేయాలన్న డిమాండ్లు సోషల్‌ మీడియాలో వెల్లువెత్తాయి.

సెంటిమెంట్‌గామారిన దూబే ఎన్‌కౌంటర్‌

దూబే ఎన్‌కౌంటర్‌తో సెంటిమెంట్‌ మారిపోయింది.. ఆగ్రహం ముస్లింల నుంచి యోగివైపుకు మళ్లింది.. 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకూడదని ఇప్పటి నుంచే తీర్మానాలు చేసుకుంటున్నాయి బ్రాహ్మణ సంఘాలు. ఠాకూర్లు-బ్రాహ్మణుల మధ్య జరిగే ఆధిపత్యపోరాటంలో ఎప్పుడూ బలిపశువులవుతున్నది తమ వర్గమేనని బ్రాహ్మణులు చెప్పుకుంటున్నారు. తాము పట్టుపడితే ఎలా ఉంటుందో అన్నదానికి 2018లో గోరక్‌పూర్‌ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికనే నిదర్శనమని గుర్తు చేస్తున్నారు. గోరక్‌నాథ్‌ మఠంపై ఠాకూర్ల ఆధిపత్యం మొదలైనప్పటి నుంచే బ్రాహ్మణులు ఆ సామాజికవర్గంపై కినుక వహించసాగారు.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత మనోజ్‌ సిన్హాను కాదని యోగిని అందలం ఎక్కించినప్పుడు ఆ కినుక కాస్త కోపంగా మారింది.. అంతేకాదు రామమందిర ఉద్యమాన్ని ఇప్పుడు మిగతా కులాలవారు హైజాక్‌ చేసుకోవడాన్ని బ్రాహ్మణ సామాజికవర్గం జీర్ణించుకోలేకపోతున్నది.

బ్రాహ్మణులను సైడ్‌లైన్‌ చేసిన బీజేపీ

నిజానికి బీజేపీని బ్రాహ్మిణ్‌, బనియా పార్టీగా చెప్పుకునేవారు.. ఇప్పుడు తమను బీజేపీ సైడ్‌లైన్‌ చేసిందని బ్రాహ్మణులు భావిస్తున్నారు. రాజకీయనాయకులే కులాల మధ్య మంటరేపుతారు.. ఆ మంటలో చలి కాచుకుంటారు.. ఇది తెలియనంత అజ్ఞానులేం కాదు బ్రాహ్మణులు. వికాస్‌దూబే కారణంగా చనిపోయిన పోలీసులలో బ్రాహ్మణులు ఉన్నారు.. అలాగే వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు అధికారుల్లోనూ బ్రాహ్మణులు ఉన్నారు.. ఇప్పుడు ఎన్‌కౌంటర్‌ జరిగిన చౌబేపూర్‌ కూడా బ్రాహ్మణుల ఆధిపత్యమున్న ప్రాంతమే! ఆది నుంచి బ్రాహ్మణసామాజికవర్గం పాలనాపరమైన అంశాలలో నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తూ వచ్చింది.. అయితే ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పాత్ర కుచించుకుపోయింది.. ఉత్తరప్రదేశ్‌ చీఫ్‌ సెక్రటరీ అవనీష్‌ కుమార్‌ అవస్థీ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవారే అయినప్పటికీ అంత పవర్‌ఫుల్‌ అధికారి మాత్రం కాదు.. రాజకీయనాయకుడిలా ఆదేశాలు ఇవ్వలేడు.. వికాస్‌దూబేలా శాసించనూ లేడు.. మొత్తంమీద వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌ తర్వాత తమ ఆధిపత్యం తగ్గిపోతున్నదన్న భావనకు వచ్చాయి బ్రాహ్మణ సామాజికవర్గాలు. ‘ఇప్పుడు ప్రతీ బ్రహ్మణుడు వికాస్‌దూబేలా మారాలి… చేతిలో ఆయుధం ఉంటే తప్ప కోల్పోతున్న పరువు ప్రతిష్టలను తిరిగి సంపాదించుకోలేము’ అంటూ సోషల్‌ మీడియాలో వ్యాఖ్యాలు చేస్తున్నాయి..

భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??