Breaking News
  • అమరావతి : బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నకు ఫీజు చెల్లించేందుకు పాలనా అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం . బీసీజీకి 3 కోట్ల 51 లక్షల 5 వేల రూపాయల ఫీజును చెల్లించేందుకు ప్రణాళికా విభాగానికి అనుమతి మంజూరు . పాలనా వికేంద్రీకరణ, రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులపై మూడు విడతలుగా నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్. బీసీజీకి ప్రోఫెషనల్ ఫీజు కింద గతంలోనే 7 కోట్ల 2 లక్షల 10 వేలను మంజూరు చేసిన ఆర్ధిక శాఖ.
  • బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే సీట్ల సర్దుబాటుపై కాసేపట్లో స్పష్టత. అక్టోబర్ 1 నాటికి పూర్తికానున్న సీట్ల సర్దుబాటు ప్రక్రియ. ఎవరెన్ని స్థానాల్లో పోటీచేయాలన్న అంశంపై మొదలైన చర్చలు. బీజేపీ అధినాయకత్వానికి లేఖ రాసిన ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్. జేడీ(యూ) - ఎల్జేపీ మధ్య లుకలకల నేపథ్యంలో బీజేపీకి లేఖ. ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూనే బిహార్ సీఎం నితీశ్‌పై గతంలో విమర్శలు చేసిన ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్. బీజేపీ-జేడీ(యూ)-ఎల్జేపీ మధ్య కుదరాల్సిన సీట్ల సర్దుబాటు. జేడీ(యూ) అభ్యర్థులపై పోటీకి అభ్యర్థులను నిలబెడతానని ప్రకటించిన చిరాగ్. సీట్ల సర్దుబాటులో బీజేపీ-జేడీ(యూ) మధ్య భేదాభిప్రాయాలు. తాజా చర్చలతో పోటీ చేయాల్సిన సీట్ల సంఖ్యపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.
  • చెన్నై : చెన్నై విమానాశ్రయం లో భారీగా పట్టుబడ్డ బంగారం . దుబాయ్ నుండి చెన్నై కి అక్రమంగా బంగారం తరలుస్తునట్టు గుర్తింపు. పట్టుబడ్డ 1.62 కేజిల బంగారం విలువ 83 లక్షలు. బంగారాన్ని నల్లటి రాళ్ల రూపంలో అక్రమంగా తరలిస్తున్న ముఠా. ముగ్గురుని అరెస్ట్ చేసి విచారణ చేప్పట్టిన కస్టమ్స్ అధికారులు .
  • బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు అప్డేట్: శ్రావణి ఆత్మహత్య కేసులో దేవరాజ్ రెడ్డి,సాయికృష్ణ రెడ్డి ఇద్దరిని మూడు రోజుల కస్టడీకి తీసుకొని విచారించిన పోలీసులు. శ్రావణి నివాసంతో పాటు శ్రీ కన్య హోటల్ వద్ద దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణ రెడ్డి ఇద్దరితో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన ఎస్ ఆర్ నగర్ పోలీసులు. మూడు రోజుల పాటు విచారించిన పోలీసులు.. శ్రావణి కి సంబంధించిన కాల్ రికార్డ్స్ ను వాట్సాప్ చాటింగ్ గురించి వివరాలు సేకరించారు.. కస్టడీ ముగియడంతో ఈరోజు నిందితులు ఇద్దరిని కోర్టులో హాజరు పరచనున్నా పోలీసులు.
  • కరోనా బారినపడ్డ గోవా డీజీపీ ముకేశ్ కుమార్ మీనా. వెల్లడించిన గోవా ఆరోగ్య శాఖ.
  • వైఎస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సీఎం జగన్. జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్న మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ మాధవ్. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద బోరు బావులను తవ్వే రిగ్గు వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. రింగు వాహనాలతో నగరంలో భారీ ర్యాలీ.

నటరత్న విశ్వనాథశాస్త్రి కన్నుమూత

ప్రముఖ విద్వాంసుడు.. నాటక, సాహిత్యవేత్త బ్రహ్మశ్రీ రొట్టె విశ్వనాథశాస్త్రి సోమవారం కన్నుమూశారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన విశ్వనాథశాస్త్రి కొద్దిరోజులుగా అనారోగ్యానికి గురైన అయన సోమవారం తుదిశ్వాస విడిచారు. వయస్సు 85 సంవత్సరాలు.

brahmashri rotte vishwanathashastri passed away on monday, నటరత్న విశ్వనాథశాస్త్రి కన్నుమూత

ప్రముఖ విద్వాంసుడు.. నాటక, సాహిత్యవేత్త బ్రహ్మశ్రీ రొట్టె విశ్వనాథశాస్త్రి సోమవారం కన్నుమూశారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన విశ్వనాథశాస్త్రి కొద్దిరోజులుగా అనారోగ్యానికి గురైన అయన సోమవారం తుదిశ్వాస విడిచారు. వయస్సు 85 సంవత్సరాలు. దృశ్యకావ్య పరంపరకు మెరుగులు దిద్ది, సంప్రదాయ నాటకరంగానికి వెలుగుబాట చూపిన వైతాళికుడు విశ్వనాథశాస్త్రి. రంగస్థల నటుడిగా, ప్రయోక్తగా, దర్శకుడిగా, రచయితగా, కవిగా ఆయన సుప్రసిద్ధుడు. ధర్మపురిలో లక్ష్మీ నరసింహ నాట్యమండలి వ్యవస్థాపకుల్లో ఒకరుగా మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. వివిధ రంగాలకు విశేష కృషి చేసిన ఆయన 1959లో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు చేతులమీదుగా నటరత్న బిరుదును పొందారు. శృంగేరీ పీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వామి వారి చేతులమీదుగా ఉత్తమ పౌరాణికులుగా అవార్డును సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయస్థాయిలో అనేక సన్మానాలు, బిరుదులను విశ్వనాథశాస్త్రి స్వీకరించారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Related Tags