‘చంద్రయాన్‌2’పై హాలీవుడ్ హీరో బ్రాడ్‌పిట్‌ ఆరా!

Brad Pitt Phones Astronaut Asks

హాలీవుడ్ సూపర్ స్టార్ ‘బ్రాడ్ పిట్’కు  సామాజిక అంశాల పట్ల అవగాహన, వాటి పట్ల చైతన్యం ఎక్కువ. ఆయన నటించిన తాజా చిత్రం ఆడ్ అస్ట్ర. ఇదో సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ. అంతరిక్షం, అంతరిక్ష ప్రయోగాలను ప్రధాన కథాంశంగా తీసుకుని రూపొందించిన సినిమా. ఇందులో వ్యోమగామిగా నటిస్తున్నారాయన. ఈ నెలలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సినిమా విడుదలను దృష్టిలో పెట్టుకుని ఆడ్ అస్ట్ర.. ప్రమోషనల్ టూర్ లో పాల్గొన్నారు బ్రాడ్ పిట్. ఇందులో భాగంగా.. అమెరికాకు చెందిన అంతరిక్ష శాస్త్రవేత్త నిక్ హేగ్ తో మాట్లాడారు. స్పేస్ స్టేషన్ లో ఉన్న నిక్ హేగ్ తో బ్రాడ్ పిట్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. అంతరిక్ష ప్రయోగాలు, వాటి ఫలితాలు, ఉపయోగాల గురించి సుమారు 20 నిమిషాల పాటు అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు బ్రాడ్ పిట్.

భారత అంతరిక్ష పరిశోధక సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 గురించి తెలుసా? అంటూ బ్రాడ్ పిట్ వ్యోమగామి నిక్ హేగ్ ను ప్రశ్నించారు. చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగంగా ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీద ల్యాండ్ కాలేదనే విషయం తనకు తెలిసిందని, దాని గురించి వివరించాలని కోరారు. దీనిపై నిక్ హేగ్ మాట్లాడుతూ.. అదో దురదృష్టకర ఘటన అని అభివర్ణించారు. ఇప్పటిదాకా విక్రమ్ ల్యాండర్ ఆచూకీ దొరకట్లేదని అన్నారు. దీనికోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తనవంతు సహాయ సహకారాలను భారత అంతరిక్ష శాస్త్రవేత్తలకు అందజేస్తోందని చెప్పారు. త్వరలోనే దాని జాడ దొరుకుతుందని ఆశిస్తున్నానని బ్రాడ్ పిట్ వ్యాఖ్యానించారు. గురుత్వాకర్షణ శక్తి ఏ మాత్రం లేని అంతరిక్షంలో వ్యోమగాముల జీవన విధానం ఎలా ఉంటుందని బ్రాడ్ పిట్ ప్రశ్నించగా.. తాము గాల్లో తేలుతుంటామని నిక్ హేగ్ బదులిచ్చారు.

బ్రాడ్ పిట్ ఇదివరకు నటించిన సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ జీరో- గ్రావిటీ. ఆ సినిమా ఎలా ఉందంటూ బ్రాడ్ పిట్ ప్రశ్నించగా.. తాను అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి రాకముందే ఆ సినిమాను చూశానని నిక్ హేగ్ బదులిచ్చారు. గురుత్వాకర్షణ లేని అంతరిక్షంలో చేసే సాహసాలు తనను బాగా ఆకట్టుకున్నాయని, వ్యోమగాముల జీవన శైలిని ఆ సినిమా ప్రతిబింబించిందని అన్నారు. జీరో- గ్రావిటీ సినిమా సెట్టింగ్ లన్నీ బాగా కుదరిరాయని, ప్రస్తుతం తాము ప్రయోగాలు సాగిస్తోన్న స్పేస్ స్టేషన్ ను తలపించాయని జవాబిచ్చారు.

వ్యోమగామిగా మారడం కష్టమైన పని కదా? అని బ్రాడ్ పిట్ ప్రశ్నించగా.. దీనిపై తమకు అన్ని విధాలుగా శిక్షణ ఇస్తారని అన్నారు. భూమి మీద నివసించే ప్రజలు రోజుకు ఒక్కసారి మాత్రమే సూర్యాస్తమయాలను చూస్తుంటారని, అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ఉండే వ్యోమగాములు మాత్రం రోజూ కనీసం 10 నుంచి 15 సార్లయినా సూర్యాస్తమయాలను తిలకిస్తుంటారని, అదో అద్భుతమైన అనుభవమని నిక్ హేగ్ చెప్పారు.

Brad Pitt Phones Astronaut Asks

17/09/2019,6:21PM
Brad Pitt Phones Astronaut Asks

17/09/2019,6:10PM

 

Brad Pitt Phones Astronaut Asks

17/09/2019,6:10PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *