ఎస్‌బీఐ బ్యాంక్ బంపర్ ఆఫర్: 70 లీటర్ల పెట్రోలు ఫ్రీ..

ప్రస్తుతమున్న కాలంలో.. ప్రతీ ఇంట్లోనూ వెహికల్స్ ఉండటం కామన్. కనీసం.. టూవీలర్‌ అయినా ఉంటుంది. అలాగే.. ఈ మధ్య కాలంలో అందరూ క్రెడిట్‌ కార్డు కూడా విరివిగా వాడుతూంటున్నారు. ఈ క్రమంలో.. ఎస్‌బీఐ బ్యాంక్.. క్రెడిట్ కార్డు వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడే.. కస్టమర్లకు సంవత్సరానికి 70 లీటర్ల పెట్రోల్‌ను ఉచితం.. అంటూ.. ప్రకటించింది. దీంతో.. వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బీపీసీఎల్ ఎస్‌బీఐ కార్డును జతకట్టనుంది. స్టేట్ బ్యాంక్ […]

ఎస్‌బీఐ బ్యాంక్ బంపర్ ఆఫర్: 70 లీటర్ల పెట్రోలు ఫ్రీ..
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2019 | 10:39 AM

ప్రస్తుతమున్న కాలంలో.. ప్రతీ ఇంట్లోనూ వెహికల్స్ ఉండటం కామన్. కనీసం.. టూవీలర్‌ అయినా ఉంటుంది. అలాగే.. ఈ మధ్య కాలంలో అందరూ క్రెడిట్‌ కార్డు కూడా విరివిగా వాడుతూంటున్నారు. ఈ క్రమంలో.. ఎస్‌బీఐ బ్యాంక్.. క్రెడిట్ కార్డు వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడే.. కస్టమర్లకు సంవత్సరానికి 70 లీటర్ల పెట్రోల్‌ను ఉచితం.. అంటూ.. ప్రకటించింది. దీంతో.. వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బీపీసీఎల్ ఎస్‌బీఐ కార్డును జతకట్టనుంది.

స్టేట్ బ్యాంక్ బీపీసీఎల్ ఎస్‌బీఐ కార్డును అందిస్తోంది. ఈ కార్డు పొందడానికి రూ.500 జాయినింగ్ ఫీజు చెల్లించాలి. ఈ కార్డు అప్లై చేసుకుంటే 2 వేల బోనస్ పాయింట్లు పొందవచ్చు. ఈ పాయింట్ల ద్వారా పెట్రోల్‌ బంకుల్లో పెట్రోలు లేదా డీజిల్‌ను కొట్టించుకోవచ్చు. ఇలా ప్రతీ సంవత్సరం రూ.500 పెట్టి రెన్యువల్ చేసుకుంటుంటే.. నాలుగు వేల లావాదేవీలపై ఫ్యూయెల్ సర్‌ఛార్జ్ ఉండదు. అంతేకాదు.. ఈ బీపీసీఎల్ కార్డు ద్వారా చాలా లాభాలు పొందవచ్చని స్టేట్ బ్యాంక్ తెలిపింది.

గ్రాసరీ, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్, మూవీస్, రెస్టారెంట్లు, కరెంట్ బిల్స్, పేమెంట్స్ బిల్స్‌లు కట్టేందుకు కూడా ఈ కార్డును ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ప్రతీ 100 రుపాయలపై దాదాపు 5 రెట్లు రివార్డు పాయింట్లు గెలుచుకోవచ్చు.

State Bank of India