పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య.. భయంతో ప్రియుడు సైతం..

ప్రియుడి మోసాన్ని భరించలేక యువతి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు కేసు పెడతారనే భయంతో ప్రియుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య.. భయంతో ప్రియుడు సైతం..
Follow us

|

Updated on: Aug 25, 2020 | 5:02 PM

ప్రియుడి మోసాన్ని భరించలేక యువతి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు కేసు పెడతారనే భయంతో ప్రియుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. సత్తెనపల్లి మండలం నందిగామకు చెందిన సయ్యద్‌ మహబూబీ(21), కొమెరపూడికి చెందిన షేక్‌ ఇస్మాయిల్ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నందిగామలోని మిర్చి కోల్డ్ స్టోరేజీలో ఇస్మాయిల్ పని చేస్తుండగా, మహబూబ్బి ఉపాధ్యాయ శిక్షణ కోర్సు తొలి ఏడాది పూర్తి చేసింది. ఇద్దరూ మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరూ తరచూ కలుసుకుంటూ దగ్గరయ్యారు. ఇదే క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే కొద్దిరోజులుగా వివాహం విషయం అడగ్గా ఇస్మాయిల్ మాట దాటవేస్తున్నాడు. దీంతో ఇస్మాయిల్ పై ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ క్రమంలో ఈనెల 17న ఆమె నిలదీయడంతో పెళ్లికి నిరాకరించాడు ఇస్మాయిల్.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహబూబీ పురుగుమందు తాగింది ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మరకస్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు సత్తెనపల్లిలోని ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. యువతి ఆరోగ్యం విషమించడంతో గుంటూరులోని సర్వజనాసుపత్రికి ఆదివారం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఇస్మాయిల్ పోలీసులు తనపై కేసు నమోదు చేస్తారేమోననే భయంతో ఈనెల 20న పురుగుమందు తాగాడు. వెంటనే అతనిని సత్తెనపల్లిలో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. అయితే, మహబూబీ ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఇస్మాయిల్, అతని తండ్రి హుస్సేన్‌లపై గ్రామీణ సీఐ బి.నరసింహారావు కేసు నమోదు చేశారు. యువతి మృతదేహనికి పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.