‘వాల్మీకి’ సినిమాకి నిరసన సెగలు..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ సినిమా షెడ్యూల్ ప్రస్తుతం అనంతపురం జిల్లాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలోకి కొంతమంది వాల్మీకి కులానికి చెందిన వ్యక్తులు వచ్చి గొడవకి దిగినట్లు తెలుస్తోంది. దానితో షూటింగ్‌కు బ్రేక్ పడింది. చిత్ర యూనిట్ వారికి ఎంత సర్దిచెప్పినా వినకపోవడంతో షూటింగ్‌ను అక్కడ నుంచి చేవెళ్లకు షిఫ్ట్ చేశారట. తమిళ హిట్ మూవీ ‘జిగర్తాండ’కు రీమేక్‌గా […]

'వాల్మీకి' సినిమాకి నిరసన సెగలు..!
Follow us

|

Updated on: Jul 03, 2019 | 3:47 AM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ సినిమా షెడ్యూల్ ప్రస్తుతం అనంతపురం జిల్లాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలోకి కొంతమంది వాల్మీకి కులానికి చెందిన వ్యక్తులు వచ్చి గొడవకి దిగినట్లు తెలుస్తోంది. దానితో షూటింగ్‌కు బ్రేక్ పడింది.

చిత్ర యూనిట్ వారికి ఎంత సర్దిచెప్పినా వినకపోవడంతో షూటింగ్‌ను అక్కడ నుంచి చేవెళ్లకు షిఫ్ట్ చేశారట. తమిళ హిట్ మూవీ ‘జిగర్తాండ’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అథర్వ మురళి, పూజా హెగ్డే కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.