పేరెంట్స్ ఫోన్ తీసుకున్నార‌ని బాలుడు ఆత్మ‌హ‌త్య‌..!

ప్ర‌స్తుతం జ‌న‌రేష‌న్ పిల్ల‌లు మ‌రీ సెన్సిటీవ్ గా త‌యార‌య్యారు. వారు ఏ విష‌యానికి హ‌ర్ట‌వుతారో అస్స‌లు అర్థం కావ‌డం లేదు. చిన్న‌, చిన్న విష‌యాల‌కు కూడా నిండు జీవితాల‌ని బ‌లి తీసుకుంటున్నారు. త‌ల్లిదండ్రులు మంద‌లిస్తే చాలు..ఉరితాళ్ల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. తాజాగా అటువంటి ఘ‌ట‌నే మహారాష్ట్ర ఠాణె జిల్లా మిర్రా రోడ్డు ప్రాంతంలో జరిగింది. తల్లిదండ్రులు మందలించారని ఓ 13 ఏళ్ల బాలుడు సూసైడ్ చేసుకున్నాడు. ఎప్పుడూ మొబైల్​లో గేమ్స్ ఆడుతున్నాడని పేరెంట్స్ కోప్పడటం వల్లే ఉరి వేసుకున్నాడని పోలీసులు […]

పేరెంట్స్ ఫోన్ తీసుకున్నార‌ని బాలుడు ఆత్మ‌హ‌త్య‌..!
Follow us

|

Updated on: May 30, 2020 | 4:54 PM

ప్ర‌స్తుతం జ‌న‌రేష‌న్ పిల్ల‌లు మ‌రీ సెన్సిటీవ్ గా త‌యార‌య్యారు. వారు ఏ విష‌యానికి హ‌ర్ట‌వుతారో అస్స‌లు అర్థం కావ‌డం లేదు. చిన్న‌, చిన్న విష‌యాల‌కు కూడా నిండు జీవితాల‌ని బ‌లి తీసుకుంటున్నారు. త‌ల్లిదండ్రులు మంద‌లిస్తే చాలు..ఉరితాళ్ల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. తాజాగా అటువంటి ఘ‌ట‌నే మహారాష్ట్ర ఠాణె జిల్లా మిర్రా రోడ్డు ప్రాంతంలో జరిగింది. తల్లిదండ్రులు మందలించారని ఓ 13 ఏళ్ల బాలుడు సూసైడ్ చేసుకున్నాడు. ఎప్పుడూ మొబైల్​లో గేమ్స్ ఆడుతున్నాడని పేరెంట్స్ కోప్పడటం వల్లే ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

అస‌లు ఏం జ‌రిగిందంటే…

సదరు బాలుడు స్థానిక ప్రైవేటు స్కూలు లో చదువుతున్నాడు. ఇంట్లో ఉన్నప్పడు ఎక్కువగా ఫోన్ లో గేమ్స్ ఆడేవాడు. ఎన్నిసార్లు మంద‌లించినా తీరు మార‌క‌పోవ‌డంతో..అత‌డి త‌ల్లిదండ్రులు.. ..బాలుడి నుంచి ఫోన్ తీసుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ బాలుడు ఇంటిలోని ఫ్యాన్​కు ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు.