ఎయిర్‌పోర్ట్‌లో బుడ్డోడి హంగామా.. అధికారుల గుండె గుభేల్!

Boy injured after ride on airport baggage conveyor belt, ఎయిర్‌పోర్ట్‌లో బుడ్డోడి హంగామా.. అధికారుల గుండె గుభేల్!

చిన్న పిల్లలతో ప్రయాణం అంత సులువు కాదు. వారితో కలిసి ప్రయాణం చేసేటప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. లేదంటే పిల్లలు తెలిసి తెలియక చేసే పనులే విషాదాన్ని నింపుతాయి. తాజాగా అలాంటి ఓ సంఘటన అమెరికాలోని అట్లాంటా విమానాశ్రయంలో చోటు చేసుకుంది. అసలు వివరాల్లోకి వెళ్తే.. ఎడిత్‌వెగా అనే మహిళ తన చిన్న బాబుతో కలిసి ప్రయాణించేందుకు ఎయిర్‌పోర్ట్ చేరుకుంది. అయితే ఆమె లోపలికి వెళ్లి కౌంటర్ వద్ద బోర్డింగ్ పాస్ తీసుకునే క్రమంలో ఆమె కొడుకు అదృశమయ్యాడు. ఎక్కడికి వెళ్లాడని చూసుకునే లోపే బాలుడు వస్తువుల తనిఖీ బెల్టుపై ఎక్కడం మొదలుపెట్టాడు. ఆమె వెంటనే అప్రమత్తమై పరిగెత్తుకుంటూ వస్తుండగా సిబ్బంది ఆమెను అనుమతించలేదు. ఇక అప్పటికే బాలుడు బెల్టుపై ఎక్కి తనిఖీలు చేసే స్కానింగ్ రూంలోకి వెళ్లిపోయాడు. ఈలోపు ఆమె అక్కడ ఉన్న సిబ్బందికి జరిగిందంతా వివరించగా.. వారు బెల్ట్‌ను ఆపి బాలుడిని బయటికి తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు బాలుడు స్వల్పగాయాలతో బయటపడగా.. అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ సంఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డు కావడంతో.. ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పుడది నెట్టింట్లో వైరల్ అయింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *