విషాదం.. బోరు బావిలో పడిన బాలుడు మృతి..!

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లిలో బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు సాయివర్ధన్ మృతి చెందాడు. 25 అడుగుల లోతు నుంచి బాలుడి మృతదేహాన్ని ఎన్టీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీశాయి.

విషాదం.. బోరు బావిలో పడిన బాలుడు మృతి..!
Follow us

| Edited By:

Updated on: May 28, 2020 | 6:42 AM

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లిలోని బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు సాయివర్ధన్ మృతి చెందాడు. 25 అడుగుల లోతు నుంచి బాలుడి మృతదేహాన్ని ఎన్టీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీశాయి. ఆక్సిజన్ అందకపోవడంతోనే సాయివర్దన్‌ మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని మెదక్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా బుధవారం సాయంత్రం తాతతో కలసి పొలం వద్ద నుంచి ఇంటికి వెళ్తున్న సాయివర్ధన్ ప్రమాదవశాత్తు అప్పుడే వేసిన బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. దీంతో అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు దాదాపు 12 గంటల పాటు శ్రమించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. సహాయక చర్యలు పూర్తయ్యేవరకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎస్పీ చందనా దీప్తి, ఆర్డీవో సాయిరాం సంఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అనుమతి లేకుండా బోర్లు వేసిన రిగ్గు యజమానిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read This Story Also: Breaking News : హైదరాబాద్‌లో మాల్స్ మిన‌హా అన్ని షాపుల‌కు అనుమ‌తి..