బాసరలో ఏడాదిన్నర బాలుడి మృతి కేసులో అసలు నిజాలు

నిర్మల్ జిల్లా బాసరలో ఏడాదిన్నర బాలుడి మృతి కేసులో నిజాలు వెలుగు చూశాయి. రైల్వే స్టేషన్ సమీపంలో ముళ్లపొదల్లో పడి ఉన్న బాలుడి మృతదేహాన్ని ఈ నెల 19న గుర్తించారు స్థానికులు. అతను ఎవరి బాలుడు? ముళ్ల పొదల్లో పడేయాల్సిన అవసరం ఏంటి? తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడన్న అనుమానం వ్యక్తమైంది. అయితే పోలీసులు కూపీ లాగితే తీగ కదిలినట్లు.. ఇందులో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బాసరలో ఏడాదిన్నర బాలుడి మృతి కేసులో అసలు నిజాలు
Follow us

|

Updated on: Aug 25, 2020 | 1:13 PM

నిర్మల్ జిల్లా బాసరలో ఏడాదిన్నర బాలుడి మృతి కేసులో నిజాలు వెలుగు చూశాయి. రైల్వే స్టేషన్ సమీపంలో ముళ్లపొదల్లో పడి ఉన్న బాలుడి మృతదేహాన్ని ఈ నెల 19న గుర్తించారు స్థానికులు. అతను ఎవరి బాలుడు? ముళ్ల పొదల్లో పడేయాల్సిన అవసరం ఏంటి? తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడన్న అనుమానం వ్యక్తమైంది. అయితే పోలీసులు కూపీ లాగితే తీగ కదిలినట్లు.. ఇందులో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బాలుడిని ఎత్తుకెళ్లి.. నాగరాజు‌ అనే వ్యక్తి ముళ్లపొదల్లో పడేశాడు. ఆ బాలుడిని ఈనెల 11న నిజామాబాదు బస్ స్టేషన్‌లో కిడ్నాప్ చేశాడు బాసరకు‌ చెందిన నాగరాజు. రెంజల్ మండలం దండిగుట్టకు చెందిన లక్ష్మీ నుంచి బాబును ఎత్తుకెళ్లాడు. భర్తతో గొడవపడి కొడుకుతో సహా నిజామాబాద్‌కు వచ్చింది లక్ష్మి. ఆమెకు మాయమాటలు చెప్పి బాలుడిని ఎత్తుకెళ్లాడు నాగరాజు. ఇవాళ ఉదయం కలెక్టరేట్ సమీపంలో నాగరాజును గుర్తించింది లక్ష్మి. బంధువులకు సమాచారం అందించడంతో బాబు ఎక్కడ ఉన్నాడో చెప్పాలంటూ నాగరాజును చితకబాదారు బంధువులు. బాబు విషయం తనకు తెలియదని ఎవరో ఎత్తుకు వెళ్లారని బుకాయించాడు నాగరాజు. దీంతో లక్ష్మి బంధువులు నాలుగు తగిలించే సరికి అసలు విషయం చెప్పాడు.

అసలేం జరిగింది? ఏడాదిన్నర బాబును నాగరాజు ఎందుకు ఎత్తుకెళ్లాడు? ముళ్లపొదల్లో ఎందుకు పడేశాడు? బాబు ప్రాణం తీశాక ముళ్ల పొదల్లో వేశాడా? లేదంటే.. అక్కడే చంపేశాడా? అని కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. నాగరాజు నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నారు పోలీసులు.