శేష్ మ్యాజిక్.. ‘ఎవరు’ కలెక్షన్స్ అదిరిపోతున్నాయ్!

Regina Cassandra and Adivi Sesh starrer Evaru gains good collections, శేష్ మ్యాజిక్.. ‘ఎవరు’ కలెక్షన్స్ అదిరిపోతున్నాయ్!

అడవి శేష్..ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా కథకుడిగా, స్రీన్ ప్లే రైటర్‌గా అసమాన ప్రతిభ చూపిస్తున్నాడు. అందుకు ఆయన నటించిన కథ, కథనాలు అందించిన ‘క్షణం’, ‘గూఢచారి’  చిత్రాలే ఉదాహారణలు. తాజాగా ఈ యంగ్ హీరో లీడ్ రోల్‌లో నటించిన మూవీ  ‘ఎవరు’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఆగస్టు 15న విడుదలై అనూహ్య విజయాన్ని అందుకుంది ఈ చిత్రం.

గత సినిమాల ప్రభావంతో మంచి ఓపెనింగ్స్ అందుకున్న శేష్.. ‘ఎవరు’తో కెరియర్ హయ్యెస్ట్ వసూళ్లను రాబట్టారు. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.75 కోట్ల షేర్‌తో డిస్ట్రిబ్యూటర్స్‌కి కాసుల పంట పండించగా.. మూడోరోజు ఆక్యుపెన్సీ సాధించి లాభాల బాట పట్టింది. గూఢచారి చిత్రానికి తొలిరోజు రూ. 60 లక్షలు మాత్రమే రాగా.. ‘ఎవరు’ చిత్రానికి మూడు రెట్లు అధికంగా కలెక్షన్లు రాబట్టింది. తొలి రెండురోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.76 కోట్ల వసూలు చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ.3.65కోట్ల పైగా వసూళ్లు చేయడంతో వీకెండ్‌లో మరింత జోరు చూపించి సెన్సేషనల్ కలెక్షన్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *