బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు: పోలీసుల చేతిలో కీలక అధారాలు.. చివరిరోజుకు చేరిన అఖిలప్రియ పోలీసు కస్టడీ..!

టీడీపీ నేత మాజీ మంత్రి అఖిల ప్రియ పోలీసు కస్టడీ మూడో రోజుకు చేరుకుంది.

  • Balaraju Goud
  • Publish Date - 12:03 pm, Wed, 13 January 21

Akhila Priya Third day police custody: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి అఖిల ప్రియ పోలీసు కస్టడీ మూడో రోజుకు చేరుకుంది. ఇవాళ మరోసారి బేగంపేట్ పోలీసులు మరోసారి విచారిస్తున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి అఖిల ప్రియను బేగంపేట్ మహిళా పోలీస్‌స్టేషన్‌‌కు తీసుకువచ్చిన పోలీసులు.. ఉదయం 10 గంటల నుండి భూమా అఖిల ప్రియను విచారిస్తున్నారు. నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్, ఇద్దరు ఏసీపీల బృందం బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహరంపై ఆమెను ప్రశ్నిస్తోంది. కిడ్నాపర్లతో భూమా అఖిల ప్రియ మాట్లాడిన కాల్స్‌ డేటాను ఆమె ముందు మరీ ఆరా తీస్తున్నట్లు సమాచారం.

మరోవైపు, పరారీలో ఉన్న ఆమె భర్త భార్గవ్‌రామ్‌తో పాటు వారి ప్రధాన అనుచరుడు గుంటూరు శ్రీను జాడ కోసం పోలీసులు ఎంక్వేరి చేశారు. మరోవైపు కిడ్నాప్ కేసులో అఖిలప్రియ సోదరుడు భూమా విఖ్యాత్ రెడ్డి పాత్రపై ఆధారాలతో సహా పోలీసులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. నేటితో అఖిలప్రియ పోలీసు కస్టడీ పూర్తి అవుతుండటంతో.. ఇవాళ్లి పోలీసుల విచారణ కీలకంగా భావిస్తున్నారు.

ఇదీ చదవండీ…. పాలమూరులో అంతర్జాతీయ ఎయిర్‌ షో, పారామోటార్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు.. ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్