బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో మరో కొత్త ట్విస్ట్.. ఉస్మానియా ఆస్పత్రిలో అఖిలప్రియకు వైద్య పరీక్షలు.. బెయిల్‌పై సర్వత్ర ఉత్కంఠ

అఖిలప్రియను వైద్య పరీక్షల నిమిత్తం జైలు సిబ్బంది.. శనివారం మధ్యాహ్నం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో మరో కొత్త ట్విస్ట్.. ఉస్మానియా ఆస్పత్రిలో అఖిలప్రియకు వైద్య పరీక్షలు.. బెయిల్‌పై సర్వత్ర ఉత్కంఠ
Follow us

|

Updated on: Jan 09, 2021 | 4:03 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించి బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహారంలో మరో మలుపు తిరుగుతోంది. కేసులో ప్రధాన నిందితురాలుగా భావించి అరెస్టైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. శుక్రవారం అఖిలప్రియ తరపు న్యాయవాది ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆమె హెల్త్ బులెటిన్ కోర్టుకు ఇవ్వాల‌ని సికింద్రాబాద్ కోర్టు.. జైలు అధికారుల‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అఖిలప్రియను వైద్య పరీక్షల నిమిత్తం జైలు సిబ్బంది.. శనివారం మధ్యాహ్నం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు సిటి స్కాన్, అల్ట్రా సౌండ్ స్కానింగ్ నిర్వహించారు. దీంతో రిపోర్టులో ఆమె గర్భవతి కాదని వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సోమవారం ఈ రిపోర్ట్‌ను జైలు అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు.

ఇదిలావుంటే, శుక్రవారం అఖిలప్రియకు ఆరోగ్య కారణాల ద‌ృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరుపు న్యాయవాది కోర్టులో మెమో దాఖలు చేశారు. ఆమె గర్భవతి అని, ఫీట్స్ వచ్చి జైలులో పడిపోయారని అఖిల తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించాలని, అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసేలా జైలు అధికారులను ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. స్పందించిన కోర్టు అఖిల‌ప్రియ ఆరోగ్య ప‌రిస్థితిపై త‌క్షణ‌మే నివేదిక ఇవ్వాల‌ని జైలు అధికారుల‌ను ఆదేశించింది. ఈ మేరకు జైలు అధికారులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

ఇక, అఖిలప్రియ అనారోగ్యం కారణంగా బెయిల్ ఇవ్వాలంటూ ఇప్పటికే పిటిషన్ దాఖలు అయ్యింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. అఖిలప్రియ స్కానింగ్ రిపోర్టులు రావడంతో బెయిల్ పై ఇప్పుడు సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. సోమవారం బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై సికింద్రాబాద్ కోర్టు ఆదేశాలు జారీ చేయనుంది.

నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్