శాసనమండలి నుంచి బొత్స వాకౌట్

అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనమండలిలో కరువు, అనావృష్టిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు బొత్స స్పందించారు. కరువుపై అన్ని జిల్లాల నుంచి సమగ్ర నివేదికలను తెప్పిస్తున్నామని.. త్వరలోనే ఈ లెక్కలు తేలుతాయని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే కారణాలు తెలీదు కానీ ఉన్నట్లుండి ఆయన సభలో నుంచి వాకౌట్ చేశారు. దీంతో అధికార, విపక్ష పార్టీల నేతలు ఖంగుతిన్నారు. ముఖ్యమైన […]

శాసనమండలి నుంచి బొత్స వాకౌట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 22, 2019 | 2:51 PM

అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనమండలిలో కరువు, అనావృష్టిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు బొత్స స్పందించారు. కరువుపై అన్ని జిల్లాల నుంచి సమగ్ర నివేదికలను తెప్పిస్తున్నామని.. త్వరలోనే ఈ లెక్కలు తేలుతాయని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే కారణాలు తెలీదు కానీ ఉన్నట్లుండి ఆయన సభలో నుంచి వాకౌట్ చేశారు. దీంతో అధికార, విపక్ష పార్టీల నేతలు ఖంగుతిన్నారు. ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి ఇలా వెళ్లిపోవడం ఏంటని శాసనమండలి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఆ తరువాత చర్చపై సరైన సమాధానం రాకపోవడం, మంత్రి బొత్స మండలి నుంచి వెళ్లిపోవడంతో టీడీపీ శాసనమండలి సభ్యులు కూడా బయటకు వెళ్లిపోయారు. అయితే ఇప్పటివరకు అధికార పార్టీకి చెందిన సభ్యులు గానీ.. మంత్రులు గానీ సభ నుంచి వాకౌట్ చేసిన సందర్భాలు చాలా తక్కువ.

కాగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు హఠాన్మరణం చెందడంతో ఆయన ఈ సమావేశాలను హాజరుకాలేకపోయారు. దీంతో ఆయనకు బదులుగా బొత్స సత్యనారాయణనే వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.