జిమ్మిక్‌ల గురించి మీ పెదనాన్న చంద్రబాబును అడుగు: బొత్స కౌంటర్

ఏపీలో రాజధాని వివాదంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక ప్రాంతంలో భూములపై మంత్రి బొత్స, బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. శ్రీ భరత్‌కు రాజధాని ప్రాంతంలో భూములున్నాయంటూ బొత్స పరోక్ష విమర్శలు చేయగా.. దానికి అతడు స్పందిస్తూ.. తన పెళ్లికి ముందు జరిగిన వ్యవహారాన్ని.. తర్వాత పరిణామాలకు ముడి పెడుతున్నారని ఆరోపించారు. అమరావతిపై బురద చల్లడానికి తనను పావుగా వాడుకుంటున్నారని.. తనను బూచిగా చూపించి వేలాదిమంది రైతులకు […]

జిమ్మిక్‌ల గురించి మీ పెదనాన్న చంద్రబాబును అడుగు: బొత్స కౌంటర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 30, 2019 | 10:06 AM

ఏపీలో రాజధాని వివాదంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక ప్రాంతంలో భూములపై మంత్రి బొత్స, బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. శ్రీ భరత్‌కు రాజధాని ప్రాంతంలో భూములున్నాయంటూ బొత్స పరోక్ష విమర్శలు చేయగా.. దానికి అతడు స్పందిస్తూ.. తన పెళ్లికి ముందు జరిగిన వ్యవహారాన్ని.. తర్వాత పరిణామాలకు ముడి పెడుతున్నారని ఆరోపించారు. అమరావతిపై బురద చల్లడానికి తనను పావుగా వాడుకుంటున్నారని.. తనను బూచిగా చూపించి వేలాదిమంది రైతులకు అన్యాయం చేయొద్దని అన్నారు. ఇక తాజాగా ఈ వ్యాఖ్యలకు బొత్స కౌంటరిచ్చారు.

రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష తర్వాత మీడియాతో మాట్లాడిన బొత్స.. వీబీసీ కంపెనీకి భూముల గురించి ప్రస్తావించారు. తమ భూములకు సంబంధించి 2012లో జీవో ఇచ్చారని భరత్ చెప్పారని.. తన పెళ్లికి ముందు వ్యవహారమని అన్నారని గుర్తు చేసిన బొత్స.. ఆ భూములకు సంబంధించిన జీవో 2015లోనే ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జీవో కాపీనీ మీడియాకు చూపించారు. 2015లో జారీ చేసి ఈ జీవో తప్పంటారా..? అంటూ మంత్రి బొత్స మండిపడ్డారు.

జయంతిపురం గ్రామంలో ఉన్న ఆ భూముల్ని 2015లో సీఆర్డీఏ పరిధిలో కలిపారని బొత్స అన్నారు. భరత్ చెప్పినట్లుగా 2012లో ఇచ్చిన జీవోను చూపించాలని సవాల్ విసిరారు. ఒకవేళ అప్పుడే జీవో ఇస్తే మళ్లీ 2015లో ఎందుకు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘పాపం చిన్న కుర్రవాడు.. ఏదైనా మాట్లాడితే కొంత కసరత్తు చేయాలి, నిజాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. భరత్ వెళ్లి పెదనాన్న చంద్రబాబును సలహా కోరాలి. జిమ్మకులతో మాట ఎలా మార్చాలో అడిగితే ఆయన సలహా ఇస్తారు. ఎలా మారిస్తే మంచిదో అడిగి తెలుసుకుంటే మంచిది’’ అని బొత్స సెటైర్లు వేశారు. అయినా భరత్‌ను తాను ఏమీ అనకూడదని.. ఆయన తాతగారు (ఎన్వీఎస్ మూర్తి) తనకు మంచి స్నేహితుడని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు బొత్స.