Breaking News
  • విశాఖ శారదాపీఠంలో విషజ్వర పీడా హర యాగానికి పూర్ణాహుతి. 11 రోజుల పాటు సాగిన అమృత పాశుపత సహిత యాగం. యాగాన్ని పర్యవేక్షించిన శారదా పీఠాధిపతులు.. స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర.
  • కరోనా వల్ల ఆక్వా రంగం ఇబ్బందుల్లో ఉంది. వాలంటీర్ల ద్వారా ప్రజల సమాచారం సేకరిస్తున్నాం. నిత్యావసరాల ధరలు పెరగకుండా చూస్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చూస్తున్నాం-మోపిదేవి.
  • ప్రజల రాకపోకలపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నాం-మంత్రి కన్నబాబు. కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించడం. ప్రజలకు సాయం అందించడం. ఫారెన్‌ రిటర్న్స్‌ను గుర్తించేందుకు ప్రత్యేక వ్యూహం-కన్నబాబు.
  • రాష్ట్రంలో పాల సరఫరాపై వివిధ డైరీలతో మంత్రి తలసాని సమీక్ష. డోర్‌డెలివరీ యాప్‌ల ద్వారా పాల సరఫరా. పాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు-మంత్రి తలసాని. పాల వాహనాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు-తలసాని.
  • నిజామాబాద్‌లో కల్లు దొరకక ఇద్దరు మృతి. లాక్‌డౌన్‌ కారణంగా వారం రోజులుగా దొరకని కల్లు.
  • లాక్‌డౌన్‌తో చెన్నైలో విజయనగరం వాసుల అవస్థలు. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న కూలీలు. టీవీ9కు తమ గోడు చెప్పుకున్న కూలీలు.

Botsa on SIT: మీరు అడిగారు కాబట్టే వేశాం.. సిట్‌పై బొత్స సూపర్ కామెంట్

ఏపీలో సిట్ వ్యవహారం రాజకీయ రచ్చకు తెరలేపింది. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఈ క్రమంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో స్పందించారు. అసలు సిట్ ఎందుకు వేయాల్సి వచ్చిందో రహస్యాన్ని వెల్లడించేశారు మంత్రి బొత్స.
botsa revealed secret of sit, Botsa on SIT: మీరు అడిగారు కాబట్టే వేశాం.. సిట్‌పై బొత్స సూపర్ కామెంట్

AP Minister Botsa Satyanarana super comment on SIT investigation: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సూపర్ కామెంట్ చేశారు. చంద్రబాబు పాలనలో జరిగిన పరిణామాలపై జగన్ ప్రభుత్వం నియమించిన సిట్‌ వెనుక అసలు కారణాన్ని స్వయంగా వెల్లడించేశారు మంత్రి బొత్స విజయనగరంలో మీడియాతో మాట్లాడిన బొత్స.. సిట్ ఏర్పాటుపై మొదలైన రాజకీయ దుమారంపై స్పందించారు.

గత ఎనిమిది నెలలుగా అమరావతి ఇన్ సైడ్ ట్రేడింగ్, దోపిడీపై పదే పదే చెబుతున్నాం… దమ్ముంటే ఎంక్వైరీ వేయమని టీడీపీ నేతలు పలువురు, పలు సందర్భాలలో సవాళ్ళు విసిరారని బొత్స గుర్తు చేశారు. అందుకే వారి సవాళ్ళను స్వీకరిస్తూ సిట్‌ను ఏర్పాటు చేశామని బొత్స వెల్లడించారు. చంద్రబాబు హయాంలో ఒక్క ఆర్కిటెక్చర్ ఫీజు పేరిట 842 కోట్ల రూపాయలు నిర్ణయించారని, అందులో ఇప్పటి వరకే ఆర్కిటెక్చర్ ఫీజు 342 కోట్లు చెల్లింపులు జరిపారని బొత్స వివరించారు.

అమరావతిలో భూ కేటాయింపులు శాస్త్రీయ పద్దతిలో జరగలేదని, ఎన్నో అవకతవకలు జరిగాయని బొత్స అంటున్నారు. తనకు సంబంధం లేకపోయిన గతంలో వోక్స్ వాగన్ వివాదంలో తనపై ఎంక్వైరీ వేశారని ఆయనన్నారు. విచారణ వేసినపుడు ఎదుర్కొని నిజం తేల్చాలి గానీ.. బీసీ మంత్రిని కాబట్టి వెంటపడుతున్నారంటూ అర్థం పర్థం లేని కామెంట్లు చేస్తున్నారని బొత్స వ్యాఖ్యానించారు. చట్టం ముందు అందరూ సమానమేనని టీడీపీ నేతలు గుర్తించాలన్నారు.

చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంటిలో 2 వేల కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టిన లావాదేవీలకు సంబంధించి ఆధారాలు దొరికాయని ఐటి అధికారులు వెల్లడించారని బొత్స అంటున్నారు. ప్రతీ దానికి వైసీపీ నేతలపై నిందలేయడం కరెక్టు కాదని అంటున్నారీ మంత్రి.

Read this: ఏపీలో సిట్ రేపుతున్న రాజకీయ దుమారం SIT investigation rocking Andhra Pradesh

Related Tags