బోస్టన్ కమిటీ ఇచ్చిన రెండు ఆప్షన్లు ఇవే..!

ఏపీ రాజధాని విషయంలో అతి కీలకంగా భావిస్తోన్న బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికను..ఆ సంస్థ ప్రతినిధులు జనవరి 3న ప్రభుత్వానికి అందజేశారు. ముఖ్యంగా రాజధాని విషయంలో బీసీజీ కమిటీ ఇచ్చిన రెండు ఆప్షన్ల వెర్షన్..రిపోర్ట్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. కాగా నివేదికలోని ప్రధానాంశాలను ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ది ఎలా సాధ్యమవుతోంది అన్న అంశాలపై బీసీబీ గ్రూప్ ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసింది.  రాష్ట్రాన్ని ఆరు రీజియన్లుగా […]

బోస్టన్ కమిటీ ఇచ్చిన రెండు ఆప్షన్లు ఇవే..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 03, 2020 | 10:09 PM

ఏపీ రాజధాని విషయంలో అతి కీలకంగా భావిస్తోన్న బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికను..ఆ సంస్థ ప్రతినిధులు జనవరి 3న ప్రభుత్వానికి అందజేశారు. ముఖ్యంగా రాజధాని విషయంలో బీసీజీ కమిటీ ఇచ్చిన రెండు ఆప్షన్ల వెర్షన్..రిపోర్ట్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. కాగా నివేదికలోని ప్రధానాంశాలను ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ది ఎలా సాధ్యమవుతోంది అన్న అంశాలపై బీసీబీ గ్రూప్ ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసింది.

 రాష్ట్రాన్ని ఆరు రీజియన్లుగా పరిగణిస్తూ బోస్టన్ గ్రూప్ రిపోర్ట్. రాజధాని కోసం  రెండు ఆప్షన్లను ఇచ్చిన బీసీజీ :

  • ఆప్షన్‌-1 :  వైజాగ్‌లో సెక్రటేరియట్, ప్రజలతో నేరుగా సంబంధం లేని శాఖల కార్యాలయాలు, అత్యవసర అసెంబ్లీ సమావేశాలను, హైకోర్టు బెంచ్‌ను పెట్టుకోవచ్చు. ఇక అమరావతిలో హెచ్‌ఓడీల కార్యాలయాలు, అసెంబ్లీ, హైకోర్టు బెంచ్.. కర్నూలులో హైకోర్టు, స్టేట్ కమిషన్, అప్పిలేట్ బాడీలను ఏర్పాటు చేయెచ్చు.
  • ఆప్షన్-2 : విశాఖలో సెక్రటేరియట్, సీఎం, గవర్నర్ ఆఫీసులు, అన్ని శాఖల కార్యాలయాలు, అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్.. అమరావతిలో హైకోర్టు బెంచ్, అసెంబ్లీ.. కర్నూలులో హైకోర్టు, అప్పిలేట్ బాడీలను ఏర్పాటు చేసుకోవచ్చని సూచనలు

బీసీజీ కమిటీ నివేదికలో పొందు పరిచిన ప్రధాన అంశాలు :

  • విశాఖలో మాత్రమే పోర్టులు అభివృద్ది చెందాయి
  • విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు మరియు పశ్చిమ గోదావరి, కడప, కర్నూలు జిల్లాల్లో పారిశ్రామిక ఉత్పత్తి చాలా తక్కువ
  • ఏపీకి రూ. 2.2 లక్షల కోట్ల అప్పు ఉంది
  • తలసరి ఆదాయంలో కూడా ఏపీ వెనకబడి ఉంది
  • రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏడు జిల్లాలు వెనుకబడి ఉన్నాయి
  • అన్ని ప్రకృతి వనరులు ఉన్నా వినియోగించుకోలేదు
  • విశాఖ నుంచి చెన్నై వరకు రోడ్డు కనెక్టవిటీ ఉంది
  • వ్యవసాయరంగంలోనూ నాలుగు జిల్లాల్లో ఉత్పత్తి తక్కువ
  • ఇంటర్నేషనల్ లింక్ కేవలం విశాఖకు మాత్రమే ఉంది
  •  దక్షిణాది రాష్ట్రాలో ఏపీలోనే తలసరి ఆదాయం తక్కువగా ఉంది
  • వ్యవసాయంలో క్రిష్ణా, గోదావరి బేసిన్లో 50 శాతం ఉత్పత్తి ఉంది
  • కొత్తగా ఐదు ఎక్స్‌ప్రెస్ వేలను బీసీజీ ప్రతిపాదనలు
  • ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత జాతీయ సగటు కంటే తక్కువ
  • ఎకానమీలో ఏపీ ఎనిమిదో పెద్ద రాష్ట్రంగా ఉంది
  • మరిన్ని పోర్టులను అభివృద్ధి చేయడం అవసరం
  • గోదావరి, క్రిష్ణా నదులను పెన్నా నదితో అనుసంధానించాలి