బ్రిటన్ కొత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్

బ్రిటన్ కొత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.గతంలో లండన్‌ మాజీ మేయర్‌, మాజీ జర్నలిస్టుగా పనిచేశారు. ప్రధాని పదవికి థెరెసా మే జూన్‌ 7న రాజీనామా చేసిన నేపథ్యంలో.. కన్జర్వేటివ్‌ పార్టీ నేతలు తమ తదుపరి నాయకుడిగా బోరిస్‌ జాన్సన్‌ను ఎన్నుకున్నారు. పార్టీ నాయకత్వానికి జరిగిన ఎన్నికల్లో బ్రిటన్ కన్సర్వేటీవ్ పార్టీ నేతగా బోరిన్.. ప్రత్యర్ధి జెరెమీ హంట్‌పై ఘన విజయం సాధించారు. 1,59,320 మంది కన్సర్వేటీవ్ పార్టీ సభ్యుల్లో 87 శాతం మంది […]

బ్రిటన్ కొత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్
Follow us

| Edited By:

Updated on: Jul 24, 2019 | 1:32 PM

బ్రిటన్ కొత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.గతంలో లండన్‌ మాజీ మేయర్‌, మాజీ జర్నలిస్టుగా పనిచేశారు. ప్రధాని పదవికి థెరెసా మే జూన్‌ 7న రాజీనామా చేసిన నేపథ్యంలో.. కన్జర్వేటివ్‌ పార్టీ నేతలు తమ తదుపరి నాయకుడిగా బోరిస్‌ జాన్సన్‌ను ఎన్నుకున్నారు. పార్టీ నాయకత్వానికి జరిగిన ఎన్నికల్లో బ్రిటన్ కన్సర్వేటీవ్ పార్టీ నేతగా బోరిన్.. ప్రత్యర్ధి జెరెమీ హంట్‌పై ఘన విజయం సాధించారు. 1,59,320 మంది కన్సర్వేటీవ్ పార్టీ సభ్యుల్లో 87 శాతం మంది ఓట్లు వేశారు. అందులో 66శాతం ఓట్లు సాధించిన జాన్సన్ విజయఢంకా మోగించారు. ప్రత్యర్థి జెరెమీ హంట్‌కు 46,656 ఓట్లు దక్కాయి.

బ్రెగ్జిట్ డైవోర్స్ డీల్‌పై చర్చలు జరుపుతామని జాన్సన్ ఇప్పటికే వాగ్దానం చేశారు. అయితే ఆయన నేతృత్వంలోని కన్సర్వేటీవ్ పార్టీకి పార్లమెంట్‌లో తగిన మోజారిటీ లేదు. బ్రెగ్జిట్‌ను సమర్ధిస్తున్న ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన డెమొక్రాటిక్ యూనియన్ పార్టీ మద్ధతు అవసరం. ఈ పార్టీకి 10 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వీరంతా మద్దతిచచినప్పటికీ.. ఆధిక్యత స్వల్పమే. మరోవైపు బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. వేలాదిమంది నిరసనకారులు బ్రెగ్జిట్‌కు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. కాగా.. భారత ప్రధాని మోదీతో తనకున్న వ్యక్తిగత సంబంధాలతో ఇరుదేశాల మధ్య ప్రత్యేకమైన సంబంధాలు ఉండేలా చూస్తానని బోరిస్‌ జాన్సన్‌ కొద్దిరోజుల క్రితం తన పార్టీ సభ్యుల్లోని భారతీయులను ఉద్దేశించి ఒక లేఖ రాశారు.

రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి
మహిళలూ ఇది మీకే.. భర్తలు భార్యల నుంచి కోరుకునేది ఇవేనట..
మహిళలూ ఇది మీకే.. భర్తలు భార్యల నుంచి కోరుకునేది ఇవేనట..