Breaking News
  • హైదరాబాద్‌: గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ దాష్టీకం. విద్యార్థిని నేలకేసి కొట్టిన ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యం. ప్రిన్సిపాల్‌ను నిలదీసిన విద్యార్థి తల్లిదండ్రులు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండని దురుసుప్రవర్తన. ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణం కులంపేరుతో దూషిస్తూ.. చితకబాదుతున్నాడని కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు.
  • ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ. విచారణకు హాజరుకాని తెలంగాణ పీసీబీ అధికారులు . తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా . పర్యావరణ అనుమతుల విషయంలో పీసీబీ అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న పిటిషనర్‌ హయాతుద్దీన్‌.
  • ఢిల్లీ: 2020-21 వార్షిక బడ్జెట్‌ ప్రతుల ముద్రణ ప్రారంభం. ఆర్థికశాఖ కార్యాలయం నార్త్‌బ్లాక్‌లో హల్వా వేడుక. బడ్జెట్‌ ప్రతుల ముద్రణ సందర్భంగా హల్వా వేడుక ఆనవాయితీ. హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆర్థికశాఖ కార్యదర్శులు.
  • ప.గో: ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని బీజేపీ నినాదం-మాణిక్యాలరావు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి టీడీపీ మాట్లాడుతోంది. ఐదు కోట్ల ఆంధ్రుల తరపున బీజేపీ-జనసేన పోరాడుతుంది. రాష్ట్రంలో జగన్ పాలన తుగ్లక్ పాలనను గుర్తుచేస్తోంది-మాణిక్యాలరావు.
  • సిద్దిపేట: గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారం. ఈ ఎన్నికల్లో ఉత్తమ్‌ మాటలన్నీ ఉత్తర ప్రగల్బాలే అని తేలిపోనుంది. 2 వేల వార్డులు గెలుస్తామంటున్న బీజేపీకి.. గజ్వేల్‌లోని 20 వార్డుల్లో ఏ ఒక్క వార్డు గెలవలేరు-హరీష్‌రావు. 20 వార్డులను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి-హరీష్‌రావు.

వర్షాలు లేక.. బోర్లు విలవిల

Rainfall, వర్షాలు లేక.. బోర్లు విలవిల

రాష్ట్రంలో రోజు రోజుకి నీటి కొరత ఏర్పడుతోంది. వానలు పడటం ఆలస్యం కావడంతో భూగర్భ జలమట్టంపై ప్రభావాన్ని చూపుతోంది. ప్రతియేటా జూన్‌ 12వ తేదీ నాటికి అటూ ఇటుగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తుంటాయి. రుతుపవనాల రాకకు ముందు నుంచే వాతావరణం చల్లబడి చెదురుముదురు వర్షాలు కురుస్తుంటాయి. వీటి సంఖ్య తగ్గిపోవడంతో లోటు వర్షపాతం నమోదయింది. దీనికి తోడు 2018-19 సంవత్సరంలో 18 శాతం లోటు వర్షపాతం నమోదయింది. వీటన్నింటి ఫలితంగా రాష్ట్రంలో 20 శాతం భూభాగంలో నీటిమట్టం పూర్తిగా పడిపోయింది. జిల్లాల్లో వేలాది బోర్లు నీళ్లులేక బావురుమంటున్నాయి. ఇక గ్రామాల్లో నివసించే ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. మరో వైపు వానలు ఎప్పుడు వస్తాయా అని అన్నదాత ఎదురుచూస్తున్నాడు.

ఒకవేళ అనుకున్నట్లుగా ఇప్పుడు వర్షాలు కురిసినా భూగర్భ జలం తిరిగి పుంజుకోవాలంటే కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. మరోపక్క వర్షాలు క్రమం తప్పకుండా కురవకపోతే ఖరీఫ్‌ సాగుకోసం రైతులు బోర్ల పై ఆధారపడే అవకాశాలు ఉన్నాయి. ఇటు బోర్లలో నీరు లేక వర్షాలు పడక అన్నదాత దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. రాష్ట్రంలో ప్రతియేటా జూన్‌-మే నెలల మధ్య కురవాల్సిన సాధారణ వర్షపాతం 904 మిల్లీమీటర్లు. కాని ఈ ఏడాది 18 శాతం లోటుతో 738 మిల్లీమీటర్లు కురిసింది. రాష్ట్రంలో 19 జిల్లాల పరిధిలోని 299 మండలాల్లో 20 నుంచి 59 శాతం లోటు వర్షపాతం నమోదయింది.