బ్రేకింగ్.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారీ తాయిలాలు

దేశంలో కరోనా వైరస్ తో కుదేలైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం భారీ తాయిలాలు ప్రకటించింది. వీటికి రెండు ప్యాకేజీలను ప్రకటిస్తూ  పునరుజ్జీవానికి బాటలు పరిచింది..

బ్రేకింగ్.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారీ తాయిలాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 01, 2020 | 5:59 PM

దేశంలో కరోనా వైరస్ తో కుదేలైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం భారీ తాయిలాలు ప్రకటించింది. వీటికి రెండు ప్యాకేజీలను ప్రకటిస్తూ  పునరుజ్జీవానికి బాటలు పరిచింది. ఖాయిలా పడిన పరిశ్రమల కోసం 20 వేల కోట్లతో ఈక్విటీ, ఫండ్ ఆఫ్ ఫండ్స్ పేరిట 50 వేల కోట్లతో ఈక్విటీని ప్రకటించింది. రైతుల ప్రయోజనాలకు కూడా ప్రభుత్వం పెద్ద పీట వేసింది. వారికి 50 నుంచి 83 శాతం ప్రయోజనాలు దక్కేలా 14 పంటలకి కనీస మద్దతుధరను ఆమోదించింది.

‘గ్రామాలు, పేదలు, రైతులు తమ ప్రధాన వర్గాలని కేంద్ర మంత్రిమండలి ప్యానెల్ లోని ఓ సభ్యుడు తెలిపారు. రైతులు తమ రుణాలు చెల్లించేందుకు వారికి మరింత వ్యవధి లభ్యమవుతుందని, ఆగస్టులో ఈ డెడ్ లైన్ ఉంటుందని కేంద్ర మంత్రి, వ్యవసాయ శాఖ ఇన్-చార్జి కూడా అయిన నరేంద్ర తోమర్ తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డులపై వారు రుణాలు తీసుకోవచ్ఛునని, ఎప్పుడైనా తమ పంటను అమ్ముకోవచ్ఛునని ఆయన చెప్పారు. ఎక్కడైనా వారు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఉద్దేశించిన చట్టాన్ని తెస్తామని ప్రభుత్వం గత నెలలోనే హామీ ఇచ్చిందన్నారు. ఇదే సమయంలో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. వ్యవసాయదారులు ఏ రాష్ట్రంలోనైనా తమ పంట ఉత్పత్తులను విక్రయించుకోవచ్చునని, అలాగే ఈ-ట్రేడింగ్ ను ఎంచుకోవచ్ఛునని వివరించారు.

ఇలా ఉండగా.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 20 వేలకోట్ల విలువైన ప్యాకేజీని ఇవ్వడంవల్ల 2 లక్షల యూనిట్లకు ప్రయోజనం కలుగుతుందని మరో మంత్రి  ప్రకాష్ జవదేకర్ తెలిపారు. 50 వేల కోట్ల ప్యాకేజీ వల్ల వీధివ్యాపారులకు, హాకర్లు, చర్మ వృత్తివారికి లబ్ది కలుగుతుందని, సెలూన్లకు రూ 10 వేల ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు. మొత్తం మీద 50 లక్షలమందికి రుణం, లేదా సాయం లభిస్తుందని వివరించారు.

మరోవైపు..సూక్ష్మ, చిన్న, మధ్యతరహా యూనిట్లకు కొత్త నిర్వచనాన్ని కేబినెట్ ఆమోదించింది. (ఆర్ధిక శాఖ ఇదివరకే ఈ ప్రతిపాదన చేసింది). రూ. 25 లక్షల పెట్టుబడి ఉండి 10 లక్షల టర్నోవర్ గల మైక్రో యూనిట్ల పెట్టుబడిని  కోటి రూపాయలకు, వాటి టర్నోవర్ ని 5 కోట్లకు పెంచారు. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడి పరిమితిని 5 కోట్ల నుంచి 10 కోట్లకు, టర్నోవర్ పరిమితిని రెండు కోట్ల నుంచి 50 కోట్లకు పెంచారు. మధ్య తరహా యూనిట్లకు ఆర్ధిక శాఖ పెట్టుబడి పరిమితిని 10 కోట్ల నుంచి 20 కోట్లకు, టర్నోవర్ ని 5 కోట్ల నుంచి 100 కోట్లకు పెంచింది. అయితే ఇండస్ట్రీ పెద్దలతో సంప్రదించిన అనంతరం.. ఇన్వెస్ట్ మెంట్ లిమిట్ ని 50 కోట్లకు, టర్నోవర్ ని 250 కోట్లకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది.

రైతులకు సంబందించి.. కనీస మద్దతు ధరను 150 శాతం పెంచాలన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని మంత్రులు తెలిపారు. దీనివల్ల రైతులు తాము పెట్టిన వ్యయానికి 50 నుంచి 83 శాతం అదనంగా సాయాన్ని పొందగలుగుతారని వారు పేర్కొన్నారు.