కర్నూలు జిల్లాలో క్షిపణి పరీక్ష విజయవంతం

DRDO successfully test-fires indigenous anti-tank missile for Army, కర్నూలు జిల్లాలో క్షిపణి పరీక్ష విజయవంతం

కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద డీఆర్‌డీవో నిర్వహించిన క్షిపణి పరీక్ష విజయవంతమైంది. తక్కువ బరువు కలిగిన యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్‌ను డీఆర్‌డీవో పరీక్షించింది. ఆర్మీ సహకారంతో క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ఆర్మీ జవాను మోసుకెళ్లే విధంగా డీఆర్‌డీవో ఈ క్షిపణిని రూపొందించింది. అనుకున్న సమయం ప్రకారం ఇది లక్ష్యాలను ఛేదించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్షిపణితో రెండున్నర కిలోమీటర్ల దూరంలోని యుద్ధ ట్యాంకును ధ్వంసం చేశారు. ఇది భారత సైన్యం ఆయుధ సంపత్తిని మరింత ఇనుమడింపజేసింది.భారత సైన్యం ఆయుధ సంపత్తిని మరింత ఇనుమడింపజేసింది. లక్ష్యాలన్నింటిని చేరుకున్నట్లు డీఆర్​డీవో ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయోగం విజయవంతం కావటంతో సైన్యం కోసం మూడో తరం క్షిపణిని దేశీయంగా అభివృద్ధి చేసి ఇవ్వడానికి మార్గం సుగమమైంది.  డీఆర్​డీవో బృందాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ అభినందించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న డీఆర్​డీవో పరిశ్రమలో ప్రయోగాన్ని చేపట్టారు.

14.5 కిలోల బరువుతో 2.5 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ఛేదించగలిగే మూడో తరం క్షిపణిని డీఆర్​డీవో 2015 నుంచి అభివృద్ధి చేస్తూ వస్తోంది. యుద్ధ ట్యాంకుల్ని విధ్వంసం చేయగిలిగిన శక్తివంతమైన పేలుడు పదార్థంతో కూడిన వార్​హెడ్ దీనికి ఉంటుంది. ప్రయోగాత్మక పరీక్షల కోసం డీఆర్​డీవో 2018 చివరి నాటికి దీని ప్రొటోటైప్​ను భారత సైనానికి అప్పగించింది. ఈ ఏడాది మార్చి 13, 14 తేదీల్లో రాజస్థాన్​లోని ఎడారి ప్రాంతంలో డీఆర్​డీవో వరుసగా రెండు ప్రయోగాలు చేసింది. 2021 నుంచి వీటి ఉత్పత్తి పెద్ద ఎత్తున మొదలవుతుంది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేస్తున్న ఈ క్షిపణుల సామర్థ్యంపై రక్షణశాఖ తొలుత అనుమానం వ్యక్తం చేసింది. విదేశాల్లో తయారైన వాటి కొనుగోలుకు మొగ్గుచూపింది. అయితే క్షిపణులన్ని విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించటంతో రక్షణశాఖ సంతోషం వ్యక్తం చేసింది. మూడు ప్రయోగాలు విజయవంతం కావటంతో సైన్యానికి కావాల్సిన తేలికపాటి క్షిపణులు త్వరలోనే వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *