ఇళ్లలోనే బోనాల పండుగ-మంత్రి తలసాని

కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది ఇళ్లలోనే బోనాల పండుగ జరుపుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో...

ఇళ్లలోనే బోనాల పండుగ-మంత్రి తలసాని
Follow us

|

Updated on: Jul 03, 2020 | 2:07 PM

Bonela festival at home : కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది ఇళ్లలోనే బోనాల పండుగ జరుపుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.  బోనాల సందర్భంగా ఎలాంటి ఊరేగింపులు ఉండవని ప్రకటించారు. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాలి బోనాల జాతర నిర్వహణపై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఆలయంలోనే వేదపండితులు, ట్రస్ట్‌ సభ్యుల మధ్య జాతర జరుగుతుందని అన్నారు. ప్రతి ఏడాది ఆనవాయితీగా జరిగే పూజలను సంప్రదాయబద్దంగా నిర్వహిస్తామని వెల్లడించారు. బోనాల వేడుకలను ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. వచ్చే శుక్రవారం, ఆదివారం, సోమవారాల్లో భక్తులకు ప్రవేశం లేదన్నారు. ఆదివారం నాటి పూజలు, సోమవారం జరిగే  “రంగం” యధావిధిగా  జరుగుతుందని తెలిపారు. జాతరలో తాను కూడా పాల్గొనడం లేదని స్పష్టం చేశారు.