పార్టీ మారుతారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన బొండా ఉమ

Binda Uma

గతకొద్ది రోజులుగా టీడీపీని వీడి మరో పార్టీలోకి మారుబొతున్నారన్న వార్తలను ఆ పార్టీ నేత బొండా ఉమా కొట్టిపారేశారు. ఎట్టిపరిస్థితుల్లో టీడీపీని వీడేది లేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. కాగా, పార్టీ మారుతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఇటీవల ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆయనతో చర్చలు జరిపారు. తాజాగా చంద్రబాబుతో కూడా బొండా భేటీ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *