అమెరికాలో బోనాల జాతర.. డ్యాన్స్‌లతో హోరెత్తించిన మహిళలు

తెలంగాణలో ప్రతియేటా ఘనంగా నిర్వహించే బోనాల పండుగ ఇప్పుడు ఖండాంతరాలకు వ్యాపించింది. తెలంగాణ అసోసియేషన్ ఆప్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో జరిగిన బోనాల సంబురం అంబురానికి తాకింది. కమిటీ రధసారధి, ప్రెసిడెంట్ మోహిత్ కర్పూరం, కార్యవర్గ బృంద నేతృత్వంలో ఈ సంబురాలు జరుపుకున్నారు. TGFL తక్కువ సమయంలోనే ఎంతో అభివృద్ధి చెందింది. విభిన్న ప్రాంతాల నుంచి వచ్చిన 700 మందికి పైగా తెలుగు తేజాలు.. బోనాల సంబరాలను అత్యంత అద్భుతంగా నిర్వహించి తమ ఖ్యాతిని నలువైపులా వ్యాపింపజేశారు. TGFL […]

అమెరికాలో బోనాల జాతర.. డ్యాన్స్‌లతో హోరెత్తించిన మహిళలు
Follow us

| Edited By:

Updated on: Jul 30, 2019 | 11:03 AM

తెలంగాణలో ప్రతియేటా ఘనంగా నిర్వహించే బోనాల పండుగ ఇప్పుడు ఖండాంతరాలకు వ్యాపించింది. తెలంగాణ అసోసియేషన్ ఆప్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో జరిగిన బోనాల సంబురం అంబురానికి తాకింది. కమిటీ రధసారధి, ప్రెసిడెంట్ మోహిత్ కర్పూరం, కార్యవర్గ బృంద నేతృత్వంలో ఈ సంబురాలు జరుపుకున్నారు. TGFL తక్కువ సమయంలోనే ఎంతో అభివృద్ధి చెందింది. విభిన్న ప్రాంతాల నుంచి వచ్చిన 700 మందికి పైగా తెలుగు తేజాలు.. బోనాల సంబరాలను అత్యంత అద్భుతంగా నిర్వహించి తమ ఖ్యాతిని నలువైపులా వ్యాపింపజేశారు. TGFL ఇంత ప్రాచుర్యం పొందడానికి కార్యవర్గం శ్రమ, పట్టుదల ఒక ఎత్తైతే.. వారు చేపట్టే ప్రతి అంశం ఇంతకు మించి ఉంటుందని మోహిత్ కర్పూరం అంటున్నారు. పిల్లలను మాతృభూమి సంప్రదాయాలకు చేరువ చేస్తూ.. ప్రతి ఒక్కరినీ తన వారిగా, తనే ప్రతి ఒక్కరి గుండె చప్పుడుగా పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా మహిళలు డ్యాన్స్‌లతో హోరెత్తించారు. దీంతో బోనం సంప్రదాయం అటు అమెరికా వాసులను కూడా ఆకట్టుకుంది.