ఆలయ చరిత్రలో తొలిసారిగా..: మంత్రి తలసాని

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి భారీగా కేసులు సమోదవుతున్నాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరను నిరాడంబరంగా నిర్వహించనున్నామని

ఆలయ చరిత్రలో తొలిసారిగా..: మంత్రి తలసాని
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2020 | 1:49 AM

Bonalu celebrations: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి భారీగా కేసులు సమోదవుతున్నాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరను నిరాడంబరంగా నిర్వహించనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు. ఆదివారం నుంచి ఉజ్జయినీ మహంకాళి బోనాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో జాతర ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఆలయ చరిత్రలో మొదటిసారిగా భక్తులు లేకుండా బోనాల వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతిఒక్కరు ఇళ్లలోనే ఉంటూ బోనాలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనవసరంగా బయటకు వచ్చి భక్తులు ఇబ్బందులు పడొద్దని సూచించారు.

Also Read: అంబానీ, బఫెట్‌లను దాటేసి.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్..