చెర్రీకి బాలీవుడ్.. ఎన్టీఆర్‌కు హాలీవుడ్..?

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరి మీద యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న జక్కన్న వచ్చే షెడ్యూల్‌లో హీరోయిన్లను భాగస్వామ్యం చేయాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో హీరోయిన్ల వేటలో పడ్డాడు. ఇదిలా ఉంటే కథానుగుణంగా ఇందులో ఇద్దరు భామలు ఉండనుండగా.. ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ హీరోయిన్‌ను, చెర్రీ కోసం బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకోవాలని రాజమౌళి భావిస్తున్నాడట. అందులో భాగంగా బాలీవుడ్ నుంచి అలియా భట్‌తో […]

చెర్రీకి బాలీవుడ్.. ఎన్టీఆర్‌కు హాలీవుడ్..?
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 3:11 PM

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరి మీద యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న జక్కన్న వచ్చే షెడ్యూల్‌లో హీరోయిన్లను భాగస్వామ్యం చేయాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో హీరోయిన్ల వేటలో పడ్డాడు.

ఇదిలా ఉంటే కథానుగుణంగా ఇందులో ఇద్దరు భామలు ఉండనుండగా.. ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ హీరోయిన్‌ను, చెర్రీ కోసం బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకోవాలని రాజమౌళి భావిస్తున్నాడట. అందులో భాగంగా బాలీవుడ్ నుంచి అలియా భట్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ కోసం ఓ హాలీవుడ్‌ హీరోయిన్‌ను కలవాలనుకుంటున్నట్లు సమాచారం. కాగా భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తోన్న విషయం తెలిసిందే.