Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

అతనో డైరెక్టర్..నడిపేది మాత్రం సెక్స్ రాకెట్..

Indian police arrest Bollywood casting director for running prostitution racket, అతనో డైరెక్టర్..నడిపేది మాత్రం సెక్స్ రాకెట్..

సినిమా..ఈ పేరులోనే ఓ మానియా ఉంది. అంతే స్థాయిలో మాయ కూడా ఉంది. సినిమాల్లో నటించాలని, టెక్నిషియన్లుగా రాణించాలని ఎంతోమంది నగరాలకు వస్తూ ఉంటారు. వాళ్ల అమాయకత్వాన్ని, అవసరాన్ని, ఆకలిని..అడ్డు పెట్టుకోని కొందరు ప్రబుద్దులు చెలరేగిపోతున్నారు. ఇప్పుడు అటువంటి వ్యక్తినే మీకు పరిచయం చేయబోతున్నాం. సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్స్ పనిచేస్తారు. అంటే మూవీలోని పాత్రలకు కావాల్సిన నటీనటులను దర్శక,నిర్మాతలకు పరిచయం చేస్తుంటారు. అలా చేసింనందుకు కొంత డబ్బులు ఛార్జ్ చేస్తారు. తప్పు లేదు. కూటి కోసం కోటి విద్యలు. అలానే నవీన్‌ కుమార్‌ ప్రేమ్‌లాల్‌ అనే వ్యక్తి బాలీవుడ్‌లో బడా సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే మనోడికి ఓ సైడ్ బిజినెస్ కూడా ఉంది.  ఇండస్ట్రీ వచ్చే యువతులను ట్రాప్ వారిని వ్యభిచార రొంపిలోకి దింపడం. మరో ఇద్దరు స్నేహితులు అజయ్‌ శర్మ, విజయ్‌లతో కలిసి గత ఐదేళ్లుగా ఈ చీకటి వ్యాపారాన్ని దర్జాగా సాగిస్తున్నాడు ఈ కేటుగాడు.

అతడి వలలో చిక్కుకోని మోసపోయిన ఓ యువతి పోలీసులకు విషయాన్ని చేరవేసింది. ఖాకీలు అతడి రూట్‌లోని గుట్టు రట్టు చేశారు. బయటి వ్యక్తుల్లా ఫోన్ చేసి తమకు అమ్మయిలు కావాలని అడిగారు. అంతే అస్సలు ఆలస్యం లేకుండా.. ‘సినిమాల్లో చేసే అమ్మాయిలు రేటు కాస్త ఎక్కువ ‘ ఫోటోలు పంపాడు ప్రేమ్‌లాల్‌. ఒక్కో యువతికి రూ. 60 వేలు అవుతోందని, హెటల్ ఖర్చులు మీరే భరించాలని చెప్పాడు. పోలీసులు సరే అన్నారు. చెప్పిన టైంకి యువతులతో కలిసి హోటల్‌లో వాలిపోయాడు అతడు. పోలీసులు కూడా గేమ్ ప్లాన్ అమలుచేసి సదరు కేటుగాడ్ని సెల్‌లో పడేశారు. ఇద్దరు యువతుల్ని విచారించి, వారిని రెస్క్యూ హోంకు తరలించారు.