సోషల్ మీడియాలో ‘బాయిస్ లాకర్ రూమ్’ బీభత్సం‌.. అడ్మిన్ అరెస్ట్‌..!

దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించిన బాయిస్ లాకర్ రూమ్‌ అడ్మిన్‌ను ఢిల్లీ సైబర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి గ్రూప్‌లోకి ఇతర విద్యార్థుల సమాచారం సేకరించారు.

సోషల్ మీడియాలో 'బాయిస్ లాకర్ రూమ్' బీభత్సం‌.. అడ్మిన్ అరెస్ట్‌..!
Follow us

| Edited By:

Updated on: May 07, 2020 | 7:32 AM

దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించిన బాయిస్ లాకర్ రూమ్‌ అడ్మిన్‌ను ఢిల్లీ సైబర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి గ్రూప్‌లోకి ఇతర విద్యార్థుల సమాచారం సేకరించారు. ఈ క్రమంలో దాదాపుగా 27 మంది గ్రూప్ సభ్యులను గుర్తించిన పోలీసులు.. వారి ఫోన్లను స్వాధీనం చేసుకొని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 13 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయస్సున విద్యార్థులే ఉండటం గమనర్హం.

కాగా ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాలో బాయిస్ లాకర్‌ రూమ్ పేరిట ఓ గ్రూప్‌ను ఏర్పాటు చేసిన వీరు.. బాలికల ఫొటోలను మార్ఫింగ్ చేసి కామెంట్లు చేసేవారు. బాలికల ఫొటోలను నగ్న ఫొటోలుగా మార్ఫ్ చేసి, గ్రూప్‌ చాట్ రూమ్‌లో షేర్ చేసుకుంటూ అసభ్యకర, నేరపూరిత సందేశాలను పంపుకునేవారు. ఆ డిస్కషన్స్‌కు సంబంధించి స్క్రీన్‌ షాట్లు ఇతర మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ఢిల్లీ సైబర్‌ పోలీసులు అప్రమత్తం అయ్యారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. అందులో భాగంగా గ్రూప్ అడ్మిన్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ గ్రూప్‌లో మొత్తం 51 మంది సభ్యులుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. గ్రూప్ వివరాలను ఇన్‌స్టా నుంచి కోరాము. జువైనల్ జస్టిస్ చట్టం కింద వీరిపై చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. మరోవైపు ఈ కేసును సుమోటాగా స్వీకరించాలని కోరుతూ ఇద్దరు న్యాయవాదులు బుధవారం ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ డీఎన్‌ పటేల్‌కు లేఖ రాశారు. పొక్సో, ఐటీ చట్టాలు, ఐపీసీ కింద ఆ మైనర్లపై కేసులు నమోదు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరారు.

Read This Story Also: ఆ డబ్బులను తిరిగి తల్లులకు చెల్లించండి.. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలకు జగన్ లేఖ