తిరుమల వకుళామాత పోటులో ప్రమాదం, ఐదుగురికి గాయాలు

తిరుమలలోని శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు తయారు చేసే వకుళామాత పోటులో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది.

  • Ram Naramaneni
  • Publish Date - 5:04 pm, Sat, 24 October 20

తిరుమలలోని శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు తయారు చేసే వకుళామాత పోటులో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. పులిహోరకు ఉపయోగించడానికి చింతపండు రసం తయారు చేస్తుండగా విద్యుత్ బాయిలర్ నుంచి ప్రెజర్ రిలీజ్ అవ్వడంతో ఐదుగురు పోటు కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని వెంటనే తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రికి తరలించారు. బాధితులకు మెడ, వీపు, చేతులపై బొబ్బలు రావడంతో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోటు సూపర్ వైజర్ వరదరాజన్ మాట్లాడుతూ ప్రతి వారం రోజులకు ఒకసారి టీటీడీ అధికారులు మాస్ క్లినింగ్ చేస్తారని చెప్పారు. ఇప్పటి వరకు ఇలాంటి ఘటన జరగలేదని తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ వేంకటేశ్వర స్వామి వారు కాపాడారనీ, ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని అన్నారు. టీటీడీ మెకానిక్ సిబ్బంది ఎప్పటికప్పుడు బాయిలర్‌ను పరిశీలిస్తుంటారని వివరించారు.

Also Read :

హైదరాబాదులో పాల ఏటీఎం

అక్కడ బుల్లెట్‌కు పూజలు, గుడి కూడా కట్టేశారు !