‘బోయింగ్ 737 మాక్స్’లను నిషేదించిన పలు దేశాలు
డిల్లీ: ‘బోయింగ్ 737 మాక్స్’లను పక్కన పెట్టిన జాబితాలో మంగళవారం భారత్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ కూడా చేరాయి. ‘‘ఈ విమానాలను తక్షణమే విమానాశ్రయాలకు పరిమితం చేయాలని డీజీసీఏ నిర్ణయించింది. ప్రయాణికుల భద్రతే అతిముఖ్యం. భద్రతాపరంగా అన్నీ పరిశీలించే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది’’ కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది. మనదేశంలో స్పైస్‌జెట్, జెట్ ఎయిర్వేస్ ఈ రకం విమానాలను కలిగి ఉన్నాయి. మరోవైపు తమ దేశంలోగాని, తమ దేశం పరిధిలోని ఆకాశంలోగాని స్వదేశీ, […]
డిల్లీ: ‘బోయింగ్ 737 మాక్స్’లను పక్కన పెట్టిన జాబితాలో మంగళవారం భారత్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ కూడా చేరాయి. ‘‘ఈ విమానాలను తక్షణమే విమానాశ్రయాలకు పరిమితం చేయాలని డీజీసీఏ నిర్ణయించింది. ప్రయాణికుల భద్రతే అతిముఖ్యం. భద్రతాపరంగా అన్నీ పరిశీలించే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది’’ కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది. మనదేశంలో స్పైస్‌జెట్, జెట్ ఎయిర్వేస్ ఈ రకం విమానాలను కలిగి ఉన్నాయి. మరోవైపు తమ దేశంలోగాని, తమ దేశం పరిధిలోని ఆకాశంలోగాని స్వదేశీ, విదేశీ విమానయాన సంస్థలకు చెందిన 737 మాక్స్ విమానాలు ఎగరడానికి వీల్లేదని బ్రిటన్ పౌర విమానయాన సంస్థ ఆదేశించింది. ఐరోపా సమాఖ్య కూడా తమ గగనతలంలో ఈ శ్రేణి విమానాలను నిషేధించింది. సింగపూర్, చైనా, మలేసియా, ఇథియోపియా, ఆస్ట్రేలియా దేశాలూ సోమవారం నుంచి తాత్కాలికంగా విమానాశ్రయాలకే పరిమితం చేశాయి. రీసెంట్గా ఇథియోథోపియాలో బోయింగ్ 737 మాక్స్ కూలిపోయి 157 మంది చనిపోవడంతో అన్ని దేశాలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.
DGCA has taken the decision to ground the Boeing 737-MAX planes immediately. These planes will be grounded till appropriate modifications and safety measures are undertaken to ensure their safe operations. (1/2)
— Ministry of Civil Aviation (@MoCA_GoI) March 12, 2019