బిన్ లాడెన్‌కు చేసినట్లుగానే.. అబూ బకర్ అంత్యక్రియలు..!

లక్షలమంది అమాయకుల ప్రాణాలను పొట్టనపెట్టుకున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ఐఎసిస్ చీఫ్ అబూ బకర్‌ అల్ బగ్దాదీ హతమైన విషయం తెలిసిందే. అమెరికా సేనలు జరిపిన వేటలో ఇరుక్కుపోయిన అబూ బకర్.. ఆత్మాహుతికి పాల్పడి ఘోరంగా చనిపోయాడు. ఇదే ఘటనలో అతడి ముగ్గురు కుమారులు కూడా ముక్కలు ముక్కలైపోయారు. ఇక అతడి మృతదేహాన్ని అమెరికన్ ఆర్మీ దళాలు ఓ సముద్రం దగ్గర పూడ్చివేశాయి. అయితే అబూ బకర్ శరీరాన్ని ఎక్కడ పూడ్చారు..? ఎప్పుడు ఖననం చేశారు..? అన్న […]

బిన్ లాడెన్‌కు చేసినట్లుగానే.. అబూ బకర్ అంత్యక్రియలు..!
Follow us

| Edited By:

Updated on: Oct 29, 2019 | 8:34 AM

లక్షలమంది అమాయకుల ప్రాణాలను పొట్టనపెట్టుకున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ఐఎసిస్ చీఫ్ అబూ బకర్‌ అల్ బగ్దాదీ హతమైన విషయం తెలిసిందే. అమెరికా సేనలు జరిపిన వేటలో ఇరుక్కుపోయిన అబూ బకర్.. ఆత్మాహుతికి పాల్పడి ఘోరంగా చనిపోయాడు. ఇదే ఘటనలో అతడి ముగ్గురు కుమారులు కూడా ముక్కలు ముక్కలైపోయారు. ఇక అతడి మృతదేహాన్ని అమెరికన్ ఆర్మీ దళాలు ఓ సముద్రం దగ్గర పూడ్చివేశాయి. అయితే అబూ బకర్ శరీరాన్ని ఎక్కడ పూడ్చారు..? ఎప్పుడు ఖననం చేశారు..? అన్న వివరాలను గోప్యంగా ఉంచారు.

కాగా 2011లో అమెరికా భద్రతా బలగాలు అల్ ఖైదా లీడర్ ఒసామా బిన్ లాడెన్‌ను పాకిస్తాన్‌లో వేటాడి చంపగా.. అతడి మృతదేహాన్ని కూడా ఓ సముద్రం దగ్గర ఖననం చేశాయి. ఇప్పుడు కూడా అలాగే అబూ బకర్‌ మృతదేహాన్ని పూడ్చివేసినట్లు సమాచారం. ఇక దీనిపై జాయింట్ చీఫ్ చైర్మన్ జనరల్ మార్క్ మిల్లే మాట్లాడుతూ.. అబూ బకర్ అంత్యక్రియలను అమెరికా భద్రతా బలగాలు పూర్తిచేశాయి అని అన్నారు.

ఐసిస్‌కు కొత్త చీఫ్ నియామకం..? అబూ బకర్ హతమైన వెంటనే ఐసిస్‌కు కొత్త వారసుడి నియామకం జరిగిపోయినట్లు తెలుస్తోంది. అబ్దుల్లా ఖర్దాష్ ను బాగ్దాదీకి వారసుడిగా, ఐసిస్ కొత్త అధినేతగా నియమించినట్టు సమాచారం. అయితే తనకేదైనా జరిగితే వారసుడిగా అబ్దుల్లా ఖర్దాష్ అలియాస్ హాజీ అబ్దుల్లా అల్ అఫ్తారీని నియమించాలని బాగ్దాదీ ఈ ఏడాది ఆగష్టులో ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. కాగా అబ్దుల్లా ఖర్దాష్ సద్దాం హుస్సేన్ బతికున్న సమయంలో ఇరాక్ మిలటరీ అధికారిగా పని చేశాడు.

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..