బ్రేకింగ్: గల్లంతైన బోటు.. లొకేషన్ గుర్తింపు..!

Boat accident location found in Kachhaluru area, బ్రేకింగ్: గల్లంతైన బోటు.. లొకేషన్ గుర్తింపు..!

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం.. కచ్చులూరు వద్ద బోటు బోల్తా పడి.. 37 మంది గల్లంతైన విషయం తెలిసిందే. వీరిని కాపాడేందుకు.. నిన్నటి నుంచి రెస్య్కూ సిబ్బంది రంగంలోకి దిగింది. కాగా.. కచ్చులూరు వద్ద గల్లంతైన బోటు లోకేషన్‌ను గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. అధునాతనమైన పరికరమైన సైడ్ స్కాన్ సోనార్ పరికరంతో.. ఎంత లోతులో ఉన్న.. బోటునైనా.. వెతికి పట్టుకోవచ్చని తెలిపారు అధికారులు. అయితే.. బోటును ఎలా పైకి తీస్తారనేది ఇప్పుడు ప్రశ్న.

కాగా.. బోటు 320 అడుగుల లోతులో ఉంది. కాగా.. బోటు 20 నుంచి 30 టన్నుల బరువు కూడా ఉంటుంది. ఇక అందులోకి వరద నీరు చేరడంతో.. బురద, ఇసుక చేరే అవకాశాలు ఉన్న కారణంగా.. బోటు మరింత బరువయ్యే అవకాశం ఉంది. అయితే.. చత్తీస్‌ఘడ్, జార్ఖండ్ ప్రాంతాల నుంచి పలువురు నిపుణులను తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. వీరు 300 అడుగుల లోతు వరకు లోపలికి వెళతారని అధికారులు చెబుతున్నారు. వారు గనక అంత లోతుకి చేరుకోగలిగితే.. బోటును పైకి తీసుకురావచ్చు. దీంతో.. గల్లంతైన వారి జాడ తెలిసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *