50 వేలు దాటింది… అయినా ముంబైలో భారీ సడలింపులు

బ్రిహాన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా... కంటైన్మెంట్‌ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో మార్కెట్లు, దుకాణాలు పూర్తిస్థాయిలో తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఆదివారాల్లో మాత్రం షాపులన్నింటినీ మూసి వేయాలని సూచించింది.....

50 వేలు దాటింది... అయినా ముంబైలో భారీ సడలింపులు
Follow us

|

Updated on: Jun 09, 2020 | 8:31 PM

కోవిడ్‌-19 విజృంభిస్తున్న తరుణంలో లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో బ్రిహాన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా… కంటైన్మెంట్‌ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో మార్కెట్లు, దుకాణాలు పూర్తిస్థాయిలో తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఆదివారాల్లో మాత్రం షాపులన్నింటినీ మూసి వేయాలని సూచించింది. రోడ్డుకు ఒకవైపున ఉన్న షాపులన్నీ ఒకరోజు తెరచి… మరుసటి రోజు రోడ్డుకు అవలివైపు ఉన్న షాపలు తెరవాలని చెప్పింది. మాల్స్‌, మార్కెట్‌ కాంప్లెక్సులను తెరవకూడదని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా రాత్రి 9 నుంచి ఉదయం ఐదు గంటల వరకు విధించిన కర్ఫ్యూ వేళలు అలాగే కొనసాగుతాయని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం వంటి నిబంధనలు తప్పకుండా పాటించేలా షాపు యజమానుల అసోసియేషన్‌ ఏర్పాట్లు చేసుకోవాలిని బీఎంసీ కొత్తగా విడుదల చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది.