Breaking News
  • సామాజిక దూరాన్ని పాటించాలని ఎంత చెబుతున్నా షాపుల దగ్గర మాత్రం ఆ ఆదేశాలను ఎవరూ పాటించడం లేదు. షాపుల దగ్గర సోషల్‌ డిస్టెన్సింగ్‌ కనిపించడం లేదు. ధరల పట్టికలను పెట్టడం లేదు. విజయవాడలాంటి పెద్ద పెద్ద నగరాలలో కూడా ఇదే పరిస్థితి. అసలే విజయవాడలో నాలుగు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అయినా అక్కడ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు జనం.. పక్కపక్కనే నిలబడి సరకులు కొనుక్కుంటున్నారు.
  • ఢిల్లీకి వెళ్లి వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. కాంటాక్టు కేసులు పెరగడంతో ఎవరెవరు ఢిల్లీకి వెళ్లి వచ్చారన్నది ఆరా తీస్తున్నారు అధికారులు. జిల్లాల వారిగా ప్రత్యేక బృందాలు ఆ పనిలోనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మందిని గుర్తించారు. వారందరిని క్వారంటైన్‌కు తరలించారు.
  • విజయవాడలోనే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు రావడంతో మరింత అప్రమత్తమయ్యారు కృష్ణా జిల్లా అధికారులు. సిటీలో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఇక విజయవాడ నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో బంద్‌ పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు.
  • ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఎంత చితక బాదినా.. ఒళ్లు హూనం చేసినా.. వాళ్లు మాత్రం మారడం లేదు. మరికొందరికి ముప్పు కొని తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. బరి తెగించిన బద్మాష్‌గాళ్లు పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు. ఏ పాపం ఎరుగని అమాయకులకి.. కరోనా మాయ రోగాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
  • కరోనా తోచనిపోయిన మృతదేహాలను మతంతో సంబంధం లేకుండా దహనం చేయాలి. ఖననం(పూడ్చి పెట్టడం) అనుమతించబడదు. అంత్యక్రియలకు 5 మందికి మించి ఉండకూడదు. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ పర్దేషి.

రాత్రిపూట అధిక బీపీ ప్రమాదాన్ని పసిగట్టగల రక్త పరీక్ష!

Blood test can determine the risk of night-time high BP, రాత్రిపూట అధిక బీపీ ప్రమాదాన్ని పసిగట్టగల రక్త పరీక్ష!

అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) ఉన్నవారు హృదయ సంబంధ వ్యాధులకు గురవుతారని, ‘రివర్స్ డిప్పింగ్’ వల్ల నిద్రపోయేటప్పుడు రక్తపోటు తక్కువగా ఉండటానికి బదులు ఎక్కువవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. దీనిని సాధారణ రక్త పరీక్ష ద్వారా గుర్తించవచ్చని వారు తెలిపారు. చాలా మందికి రాత్రిపూట లో బీపీ ఉంటుంది. యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్‌లో ప్రచురించబడిన కొత్త అధ్యయనం ప్రకారం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా రోగులకు రివర్స్ డిప్పింగ్‌ ద్వారా హృదయ సంబంధ వ్యాధులు రాకముందే వారికి అవసరమైన సహాయం పొందటానికి వీలుంటుందని తెలిపారు. “అదనపు సమస్యలకు గురికాకుండా నిరోధించడానికి.. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉన్నవారి హృదయనాళ సమస్యల ప్రమాదాన్ని గుర్తించగలము” అని యుఎస్ లోని మిస్సోరి స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ గోజల్ వివరించారు.

Related Tags