ఒకే ఒక్క‌టెస్ట్‌…50కి పైగా క్యాన్స‌ర్లు రాక‌ముందే గుర్తించ‌గ‌లం !

ఒక‌సాధార‌ణ బ్ల‌డ్ టెస్ట్‌తో 50కి పైగా క్యాన్స‌ర్‌ల‌ను అవి రాక‌ముందే క‌నిపెట్ట‌గ‌ల‌మంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు. ఈ ఒక్క టెస్ట్ ద్వారా

ఒకే ఒక్క‌టెస్ట్‌...50కి పైగా క్యాన్స‌ర్లు రాక‌ముందే గుర్తించ‌గ‌లం !
Follow us

|

Updated on: Mar 31, 2020 | 4:19 PM

ప్రాణాంత‌క మ‌హ‌మ్మారి క్యాన్స‌ర్‌..ఎప్పుడు మ‌నిషిని ఏవిధంగా అటాక్ చేస్తుందో ఎవ‌రికీ తెలియ‌దు. అది మ‌నిషి శ‌రీరంలో ప్ర‌వేశించిన త‌ర్వాత కూడా దాని ల‌క్ష‌ణాలు అంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌వు. లో లోప‌లే రోగిని పూర్తిగా తినేస్తూ…వ్యాధి మించిపోయిన త‌ర్వాత‌గానీ, చాలా ర‌కాల క్యాన్స‌ర్లు బ‌య‌ట‌ప‌డుతుంటాయి. ఈ కార‌ణంగానే చాలా మంది క్యాన్స‌ర్ బారిన ప‌డి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, తాజాగా లండ‌న్ శాస్ర్త‌వేత్త‌లు క‌నిపెట్టిన ఓ టెస్ట్ వైద్య‌నిపుణుల ప్ర‌శంస‌లందుకుంటోంది.
వివ‌రాల్లోకి వెళితే… ఒక‌సాధార‌ణ బ్ల‌డ్ టెస్ట్‌తో 50కి పైగా క్యాన్స‌ర్‌ల‌ను అవి రాక‌ముందే క‌నిపెట్ట‌గ‌ల‌మంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు. ఈ ఒక్క టెస్ట్ ద్వారా ఎన్నోర‌కాల క‌ణ‌తుల‌ను చాలా తొంద‌ర‌గా, తేలిక‌గా నిర్ధారించ‌గ‌ల‌గుతామ‌ని చెబుతున్నారు. 99.9శాతం పాజిటివ్ వ‌చ్చిన ఫ‌లితాలు ఖ‌చ్చిత‌మైన‌వే అని శాస్త్ర‌వేత్త‌ల బృందం అంటోంది. కానీ,  ఒక్క కేసు కూడా మిస్ అవ్వ‌కుండా ఎటువంటి త‌ప్పుడు ఫ‌లితాలు ఇవ్వ‌కుండా ప‌రీక్షించాలంటున్నారు.
ఇది ఎలా ప‌నిచేస్తుంది అన్న వివ‌ర‌ణ ప‌రిశీలించిన‌ట్లైతే… కొత్త‌గా క‌నిపెట్టిన ఈ టెస్ట్‌తో సాధార‌ణ‌మైన ర‌సాయ‌న మార్పుల‌తో పాటు, శ‌రీర క‌ణాల్లో నుండి ఉత్ప‌త్తి అయిన డీఎన్ ఏ ని కూడా ప‌రీక్షించగ‌లుగుతామంటున్నారు. డానా ఫార్బ‌ర్ క్యాన్స‌ర్ ఇన్సిట్యూట్, హార్వాడ్ మెడిక‌ల్ స్కూల్ శాస్త్ర‌వేత్త‌లు,  ద‌ఫ్రాన్సిస్ క్రిక్ ఇనిస్టిట్యూట్‌, యూనివ‌ర్సిటీ కాలేజ్ లండ‌న్ వారితో క‌లిసి  4 వేల‌కు పైగా న‌మూనాల‌ను ప‌రిశీలించారు. అందులో క్యాన్స‌ర్ ఉన్న‌వారు, లేని వారి న‌మూనాలు కూడా సేక‌రించి ప‌రీక్షించారు. ఊపిరితిత్తులు, అండాశ‌యాలు, ప్రేగు లాంటి దాదాపు 50 ర‌కాల క్యాన్స‌ర్ల‌ను ఈ టెస్ట్ సాయంతో క‌నుగొన‌గ‌లుగుతామ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.
నిపుణుల వివ‌ర‌ణః ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త జీఆఫ్ ఆగ్జ్‌నాడ్ ఇలా అన్నారు..ఈ ర‌క్త‌ప‌రీక్ష‌లో చాలా ఎక్కువ జ‌నాభాను ప‌రీక్షించ‌గ‌లిగే…అన్ని అవ‌కాశాలు ఉన్నాయి. ఇలాంటి ఒక‌ప‌రీక్ష మార్కెట్లోకి వీలైనంత తొంద‌ర‌గా తీసుకురావాల‌ని కోరుకుంటున్నామ‌ని చెప్పారు. వేలాది మంది పెషేంట్ల పైన‌ దీనిని ప‌రీక్షించిన త‌ర్వాత ఇప్పుడు దీనిని అమ‌ల్లోకి తీసుకువ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. కానీ, అది కూడా ప‌రిమితంగానే ఉందంటున్నారు. ఈ ర‌క్త‌ప‌రీక్ష‌ను మ‌రింత అందుబాటులోకి తెవాలంటే…దీనిపై మ‌రింత అధ్య‌య‌నం జ‌ర‌గాల్సి ఉందంటున్నారు. ఈ ర‌క‌మైన బ్ల‌డ్‌టెస్ట్ ప్రారంభ‌ద‌శ‌లోనే ఉన్న‌ప్ప‌టికీ ఫ‌లితాలు మాత్రం అంద‌రికీ లాభ‌దాయ‌కంగా ఉన్నాయంటున్నారు.
ఏదేమైన‌ప్ప‌టికీ క్యాన్స‌ర్‌ను మొద‌టి ద‌శ‌లోనే క‌నుగోన‌గ‌ల‌టం ఎంతో గొప్ప విష‌యం. ఈ సంద‌ర్బంగా  వీరి కృషి అభినంద‌నీయం. ఈ టెస్ట్ త్వ‌ర‌గా అందుబాటులోకి వ‌చ్చిన‌ట్లైతే కోట్లాది మంది ప్ర‌జ‌ల‌కు ప్రాణం పోయ‌గ‌ల‌గుతాము. వీలైనంత త్వ‌ర‌గా ఈ టెస్టును సంపూర్ణంగా అందుబాటులోకి తీసుకురావాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

మీ కళ్లను మాయచేసే చిత్రం.. ఈ ఫోటోలో జింకను కనిపెట్టగలరా
మీ కళ్లను మాయచేసే చిత్రం.. ఈ ఫోటోలో జింకను కనిపెట్టగలరా
కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్.. ఏమన్నారంటే..
కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్.. ఏమన్నారంటే..
వేసవిలో పెరుగు చద్దన్నం టై చేసి చూడండి.. అమ్మమ్మకాలం నాటి రెసిపీ
వేసవిలో పెరుగు చద్దన్నం టై చేసి చూడండి.. అమ్మమ్మకాలం నాటి రెసిపీ
హెల్త్ ఇన్సూరెన్స్‌ ఉన్నవారికి శుభవార్త.. నిబంధనలలో మార్పులు
హెల్త్ ఇన్సూరెన్స్‌ ఉన్నవారికి శుభవార్త.. నిబంధనలలో మార్పులు
CSKకు భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
CSKకు భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..