Breaking News
  • హైదరాబాద్: వరదల కారణంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. కలరా, టైఫాయిడ్,గ్యాస్ట్రో ఎంటైటిఎస్ వ్యాధులు విస్తరిస్తున్నాయి. -ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శంకర్ . ఫీవర్‌ ఆస్పత్రిలో 600 వరకు ఓపీ కొనసాగుతుంది. అంటు వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి- శంకర్ .
  • విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్‌, సీపీ. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు సూచనలు . ఎల్లుండి అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు- కలెక్టర్ ఇంతియాజ్. ఇంద్రకీలాద్రిపై భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం- సీపీ శ్రీనివాసులు .
  • గుంటూరు: బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై వైసీపీ సంబరాలు. నగరపాలెంలో వైఎస్‌ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రులు. బీసీల అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడివున్నారు- మంత్రి సుచరిత. గతంలో బీసీలను ఓటు బ్యాంకుగా చూశారు- మంత్రి సుచరిత. బీసీల సంపూర్ణ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం - మంత్రి రంగనాథ్‌రాజు . బీసీల్లో ఇన్ని కులాలు ఉన్నాయన్న సంగతీ ఎవరికీ తెలియదు-మంత్రి రంగనాథ్‌రాజు.
  • హైకోర్టులో విచారణ: ఉస్మానియా ఆసుపత్రిలో వరద చేరకుండా చర్యలు తీసుకోవాలి-హైకోర్టు . ఆసుపత్రిలో వరద, డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేదన్న పిల్‌పై హైకోర్టులో విచారణ. వరద బయటకు వెళ్లే సౌకర్యం లేక ఆసుపత్రిలోకి నీరు చేరుతుంది-పిటిషనర్‌. ఆసుపత్రిలోకి వస్తున్న వరద మూసీలోకి వెళ్లేలా ఏర్పాటు చేయాలని ఆదేశాలు . రోగులు ఇబ్బంది పడకుండా తగిని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు . తదుపరి విచారణ నవంబర్‌12కి వాయిదా .
  • ప్రధాని మోదీ కామెంట్స్‌: ఢిల్లీ: యువ‌త‌ను మ‌రింత స‌మ‌ర్థవంతంగా మార్చేందుకు.. బ‌హుళ ప‌ద్దతిలో విద్యార్థుల‌పై దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది. ఉద్యోగ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు యువ‌త‌ను తీర్చిదిద్దే ప్రయత్నం జరగాలి . ఐఐఎంల‌కు మ‌రిన్ని అధికారాలు ఇస్తున్నట్లు ప్రధాని ప్రకటన . విద్యా వ్యవస్థలో మ‌రింత పార‌ద‌ర్శకత కోసమే నేష‌న‌ల్ మెడిక‌ల్ క‌మిష‌న్‌ ఏర్పాటు.
  • ఏపీ టిడిపి కమిటీలను ప్రకటించిన చంద్రబాబు. ఏపీ టిడిపి నూతన అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు నియామకం. తెలంగాణ అధ్యక్షుడు గా ఎల్ రమణ నియామకం. 25 మందితో పోలిట్ బ్యూరో . 27 మందితో కేంద్ర కమిటీ నియామకం.
  • ఓటుకు నోటు కేసు పై నేడు ఏసీబీ కోర్ట్ లో విచారణ. ఏసీబీ కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య, ఇతర నిందితులు. తమ పేర్లు తొలగించాలని సండ్ర వెంకట వీరయ్య, ఉదయ సింహా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు. డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటరు దాఖలు చేయాలని గత విచారణ లో ఏసీబీని ఆదేశించిన కోర్టు. నేడు కౌంటర్ దాఖలు చేయనున్న ఏసీబీ. ఓటుకు కోట్లు కేసులోనేడు విచారించనున్న ఏసీబీ కోర్ట్.

చిన్నారి కంట రక్త కన్నీరు

Blood poured from girls palakshy eye in kadapa, చిన్నారి కంట రక్త కన్నీరు

ఎవరైనా ఏడిస్తే కంట్లో నుంచి నీరే వస్తుంది. కానీ పులివెందులలో ఓ బాలిక కంటిలో నుంచి రక్తం వస్తుంది. మామూలుగా ఏదైనా శరీరంలో వేడిమి ఉంటే, లేదా ఏదైనా గాయమైతే చెవి, ముక్కు, నోటి నుండి రక్తం వచ్చే సంగతి అందరికీ తెలుసు. కానీ ఈ బాలికకు కన్నీటికి బదులు రక్తం వస్తుంది. అది ఎందుకు వస్తుందో వైద్యులకు కూడా అర్థం కాని పరిస్థితిగా మారింది. పులివెందులలోని పలు స్థానిక ఆసుపత్రిలో చిన్నారికి చూపించినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. మెరుగైన చికిత్స కోసం ఆర్థిక స్తోమత లేక బాలిక, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా పులివెందుల మండలం చిన్న రంగాపురం గ్రామానికి చెందిన యువరాజు, జ్యోతిలకు ఇద్దరు సంతానం. వారిలో పెద్ద అమ్మాయి పాలాక్షి చాలా అరుదైన సమస్యతో బాధ పడుతుంది.

పాలాక్షి పులివెందులలో 8వ తరగతి చదువుతోంది. ఏమైందో ఏమో కానీ ఈ అమ్మాయికి గత 15 రోజులుగా రోజుకు 4 నుంచి 5 సార్లు కంటిలో నుంచి రక్తం కారుతోంది. రక్తం కారుతున్న సమయంలో నొప్పిగా ఉంటుందని అమ్మాయి పాలాక్షి చెబుతోంది. అమ్మాయికి కడప, పులివెందుల, అనంతపురంలోని ప్రయివేటు, ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించామని కానీ ఫలితం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. పులివెందులలో ఒక డాక్టర్ తమిళనాడులోని వేలూరు సిఎంసి కి వెళ్ళమని సూచించారని అక్కడ పరీక్షలకే దాదాపు రెండు లక్షలు ఖర్చు అవుతాయని చెప్పారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం వెళ్లాలంటే అంత స్తోమత తమకు లేదని దాతలు ఎవరైనా దయతలిస్తే మా పాపకు వైద్యం చేయించుకుంటామని పాలక్షి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Related Tags