రక్తదానంపై అవగాహన కల్పించాలి..ఏపీ గవర్నర్ పిలుపు

Blood donation equals to life says AP Governor Bishwabhusan, రక్తదానంపై అవగాహన కల్పించాలి..ఏపీ గవర్నర్ పిలుపు

రక్తదానంతో మరో ప్రాణాన్ని కాపాడవచ్చాన్నారు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్‌ హరిచందన్‌ శనివారం ఆయన రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో లయోలా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రక్తదానంపై యువకులు, విద్యార్థులు మరింత స్పూర్తిగా నిలవాలన్నారు. దీనిపై అవగాహన కలిగి ఉండాలని పిలిపునిచ్చారు.

రక్తదానం వల్ల ఎంతో ప్రాణాలను రక్షించగలుతామన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ సమజాంలో ఎన్నోసేవా కార్యక్రమాలు చేపడుతూ అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరిత్యాలు సంభవించిన సమయంలో సేవా కార్యక్రమాలు అందించడంలో ముందుంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రక్తదానం చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *