Breaking News
  • రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. ఇళ్ల నుంచి బయటకు వస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని ఆదేశించింది. చాలా మందిలో కరోనా సోకినా లక్షణాలు ఉండటంలేదని అధ్యయనంలో వెల్లడి కావడంతో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
  • ముంబై దాదార్‌లోని శుష్రుషా ఆస్పత్రి నర్సులందరినీ క్వారంటైన్‌కు తరలింపు. ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్ రావడంతో చర్యలు. కొత్తగా రోగులెవరినీ చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేసిన అధికారులు. ఇప్పటికే ఉన్న రోగులను 48 గంటల్లో డిశ్చార్జి చేయాలని ఆదేశాలు. క్వారంటైన్ చేసిన నర్సులందరికీ కరోనా టెస్టులు చేయాల్సిందిగా ఆదేశం.
  • కరోనా నుంచి పూర్తిగా కొలుకోక ముందే కొత్తగూడెం డిఎస్పీ డిశ్చార్జి.. అదే పేరుతో ఉన్న మరోవ్యక్తికి నెగిటివ్ రావటం తో డిఎస్పీ డిశ్చార్జి.. రిపోర్టులో డిఎస్పీకి పాజిటివ్ అని తేలటంతో మళ్ళీ వెనక్కి రప్పిస్తున్న వైద్యులు.. నిన్న ఇంటికి వెళ్లినా డిఎస్పీ క్వారంటైన్ లొనే ఉన్నారు..
  • కరోనాతో బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ కుట్ర. కుట్రను భగ్నం చేసిన బిహార్ పోలీసులు. నేపాల్ సరిహద్దుల ద్వారా కరోనా పాజిటివ్ ఉగ్రవాదులను భారత్‌కు పంపే అవకాశం. తద్వారా వైరస్ విస్తృతి చేయాలన్నది పాక్ కుట్రగా అనుమానం.
  • కరోనా ని ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సాయమందించిన మై హోం గ్రూప్. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి 3 కోట్ల రూపాయల చెక్ ని అందించిన మై హోం ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరక్టర్ జూపల్లి రంజిత్ రావు.

ఆక్టోపస్ కాటేస్తే.. బేర్ మంది..

Blogger Tries To Eat Octopus Alive, It Latches Onto Her And Fights Back, ఆక్టోపస్ కాటేస్తే.. బేర్ మంది..

ప్రాణం ఎవరికైనా ప్రాణమేగా.. మనం ఒకరి ప్రాణాలను అన్యాయంగా హరించాలనుకుంటే.. అది ఒక్కోసారి బెడిసికొడుతుంది. ప్రస్తుతం ఓ ఆక్టోపస్ కూడా అలానే చేసింది. సోషల్ మీడియాలో చాలా విచిత్రమైన వీడియోలు చూస్తూంటాం.. కానీ.. ఇప్పుడు మీరు ఈ వీడియోను చూస్తే మాత్రం ఒళ్లు గగుర్పొడుస్తుంది. చైనాకు చెందిన ఓ యువతి సజీవంగా ఉన్న ఆక్టోపస్‌ను తిందామనుకుంది. అయితే.. అది కాస్తా బెడిసి కొట్టి.. ఆ ఆక్టోపస్‌తో పోరాడాల్సి వచ్చింది. ఆక్టోపస్ తన ప్రాణం రక్షించుకోవాలని ఆ యువతి ముఖాన్ని తన టెంటకిల్స్‌తో గట్టిగా పట్టుకుంది. దీంతో.. భయానికి గురైన ఆ యువతి బిగ్గరగా కేకలు వేస్తూ.. ఏడుస్తూ ఎలాగోలా దాని నుంచి తప్పించుకుంది. అయితే.. దాని ప్రభావం వల్ల ఆమె ముఖం మీద చిన్నపాటి గాయమే అయింది. దీన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సజీవంగా ఉన్న ఆక్టోపస్‌ వంటి జీవులను తినొద్దని.. ఉచిత సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షల మంది ఈ వీడియోను చూశారు.

Related Tags