మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్ బాగా చూస్తున్నారా?

Children, మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్ బాగా చూస్తున్నారా?

పిల్లల్లో సెల్‌ఫోన్స్ వల్ల కంటిచూపు సమస్యలు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు . గతంలో పిల్లలు మారాం చేస్తే వారికి నచ్చింది కొని ఇవ్వడం, ఇష్టమైప పదార్ధాలు వండి పెట్టడం జరిగేది. కానీ ప్రస్తుతం అలా లేదు. వారు ఏడ్చినా, నవ్వినా స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారు తల్లిదండ్రులు. పిల్లలు కూడా ఆ ఫోన్లలో కదిలే బొమ్మలకు, పాటలకు ఆకర్షితులై గంటలతరబడి వాటికే అతుక్కుపోతున్నారు. ఇలా చేయడం మంచిది కాదంటున్నారు వైద్యులు. ఇలా స్మార్ట్ ఫోన్లకు ఎడిక్ట్ కావడం వల్ల తీవ్రమైన కంటిసమస్యలు వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లలో వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం వంటివి చేస్తూ వాటినే లోకంగా మార్చేసుకుంటున్నారు. పైగా తల్లిదండ్రులే వాటిని తమ పిల్లల చేతికి అందించి ముచ్చటపడుతున్నారు. ఇలా సెల్‌ఫోన్ చూడటానికి అలవాటు పడి ఎలాంటి ఆటలు ఆడకపోవడంతో శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

స్మార్ట్ ఫోన్లు చిన్న పిల్లల్లో అంధత్వానికి కారణమవుతున్నాయి. వాళ్లను గుడ్డివాళ్లుగా మార్చేస్తున్నాయి. ఇలా సెల్‌ఫోన్లు చూస్తూ చూపు కోల్పోతున్న కేసులు అనేకం నమోదవుతున్నాయని వైద్యులు కూడా చెబుతున్నారు. చిన్న పిల్లలు స్మార్ట్ ఫోన్లు పట్టుకుని వీడియోలు చూడటం వల్ల .. దగ్గర దృష్టికే అలవాటు పడి దూరంగా ఉన్న వస్తువుల్ని చూడలేని పరిస్థితులు వస్తున్నాయి. అలాగే స్మార్ట్ ఫోన్ లైటింగ్ వల్ల కంటి చూపు దెబ్బతిని వారి కళ్లు మసకగా మారడంతో పాటు చూపులో స్పష్టత కూడా కోల్పోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. మరి పిల్లలు సెల్ ఫోన్ చూస్తూ నవ్వుతున్నారని, తమకంటే బాగా ఆపరేట్ చేస్తున్నారని సంబరపడిపోయే తల్లిదండ్రులకు ఇది బ్యాడ్ న్యూసే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *