ఆర్‌ఎఫ్‌సీలో పేలుడు.. అసలు కారణమిదేనా.?

Blast In RFC: ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో జరిగిన పేలుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 9వ తేదీన పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో మహారాష్ట్రకు చెందిన రావు సాహెబ్(48) అనే కార్మికుడు కొత్తపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడం వల్ల అసలు ఏం జరిగిందన్న దానిపై పోలీసులు ఆరా తీయగా పలు ఆసక్తికరమైన విషయాలు బయటికి వచ్చాయి. ఈ పేలుడు గ్యాస్ లీకేజి కారణంగా జరిగిందని అబ్దుల్లాపూర్ ఇన్‌స్పెక్టర్ ఎస్. దేవేందర్ వెల్లడించారు. […]

ఆర్‌ఎఫ్‌సీలో పేలుడు.. అసలు కారణమిదేనా.?
Follow us

|

Updated on: Feb 12, 2020 | 11:08 AM

Blast In RFC: ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో జరిగిన పేలుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 9వ తేదీన పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో మహారాష్ట్రకు చెందిన రావు సాహెబ్(48) అనే కార్మికుడు కొత్తపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడం వల్ల అసలు ఏం జరిగిందన్న దానిపై పోలీసులు ఆరా తీయగా పలు ఆసక్తికరమైన విషయాలు బయటికి వచ్చాయి. ఈ పేలుడు గ్యాస్ లీకేజి కారణంగా జరిగిందని అబ్దుల్లాపూర్ ఇన్‌స్పెక్టర్ ఎస్. దేవేందర్ వెల్లడించారు.

ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉండే రామోజీ ఫిలిం సిటీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక చోటు నుంచి మరొక ప్రదేశానికి తరలిస్తున్న ఖాళీ పెయింట్ డబ్బాల నుంచి గ్యాస్ లీకేజ్ కారణంగా ఈ పేలుడు జరిగింది. సంఘటనాస్థలంలో ఒక వ్యక్తి గాయపడగా.. వెంటనే అతన్ని దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషయంగా ఉంది. బాధితుడు మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన రావు సాహెబ్‌గా గుర్తించామని ఇన్‌స్పెక్టర్ స్పష్టం చేశారు.

బీఎస్‌ఎఫ్‌లోని ఏడు, ఎనిమిది అంతస్థుల వద్ద ఈ పేలుడు సంభవించింది. రావు సాహెబ్ కొన్ని పెయింట్ బాక్స్‌లను తరలించేటప్పుడు.. ఒక పెట్ట నుంచి గ్యాస్ లీకయ్యి సిలెండర్ పేలింది. దానితో అతడు తీవ్రంగా గాయపడగా.. పెద్ద శబ్దం రావడంతో తోటి కార్మికులు ఒక్కసారిగా భయభ్రాంతులు చెందారు.