Breaking : విశాఖ: రాంకీ ఫార్మా సిటీలో భారీ పేలుడు

విశాఖ‌లోని రాంకీ ఫార్మాసిటీలో భారీపేలుడు క‌ల‌క‌లం రేపుతోంది. పేలుడు కారణంగా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌లు నెల‌కున్నాయి.

Breaking : విశాఖ: రాంకీ ఫార్మా సిటీలో భారీ పేలుడు
Follow us

|

Updated on: Jul 13, 2020 | 11:56 PM

విశాఖ‌లోని రాంకీ ఫార్మాసిటీలో భారీపేలుడు క‌ల‌క‌లం రేపుతోంది. పేలుడు కారణంగా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌లు నెల‌కున్నాయి. ఎల్జీ పాలిమర్స్‌ ఘటనను ఇంకా మ‌ర్చిపోకముందే.. తాజాగా మరో ఘటన స్థానికుల‌ను టెన్ష‌న్ పెడుతోంది. పేలుళ్లు పలుమార్లు సంభవిస్తుండటంతో ఫైర్ సిబ్బంది మంట‌ల దగ్గ‌ర్లోకి వెళ్లలేకపోతున్నారు. దీంతో ఘటనాస్థలికి దూరంగా అగ్నిమాపక సిబ్బంది ఉండిపోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. రాత్రి సుమారు 11 గంటల సమయంలో పరిశ్రమ నుంచి భారీ పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు తెలిపారు.  ఇప్పటికే పేలుడు శబ్దాలు కొన‌సాగుతూనే ఉన్నాయి.