Black Magic : క్రికెట్ గ్రౌండ్‌‌లో చేతబడి..నల్లకోడిని బలిచ్చి..

Black Magic : టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది..గుండె తీసి గుండె అమర్చే అంత దూరం ఎదిగాం. అంతరిక్షంతో అద్భుతాలు చేస్తున్నాం. అయినా భారత్‌ని చేతబడి, బాణామతి లాంటి మూఢ నమ్మకాలు వీడటం లేదు. రైస్ పుల్లింగ్, గుప్త నిధుల పేరుతో మనల్ని మనమే దిగజార్చకుంటున్నాం. తాజాగా నెల్లూరు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. పిల్లలు నిత్యం ఆడుకునే క్రికెట్ గ్రౌండ్‌ని చేతబడి వేదిక చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మైదానంలో పెద్ద బొమ్మని గీసి..అందులో నిమ్మకాయలు, […]

Black Magic : క్రికెట్ గ్రౌండ్‌‌లో చేతబడి..నల్లకోడిని బలిచ్చి..
Follow us

|

Updated on: Feb 18, 2020 | 11:20 AM

Black Magic : టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది..గుండె తీసి గుండె అమర్చే అంత దూరం ఎదిగాం. అంతరిక్షంతో అద్భుతాలు చేస్తున్నాం. అయినా భారత్‌ని చేతబడి, బాణామతి లాంటి మూఢ నమ్మకాలు వీడటం లేదు. రైస్ పుల్లింగ్, గుప్త నిధుల పేరుతో మనల్ని మనమే దిగజార్చకుంటున్నాం. తాజాగా నెల్లూరు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. పిల్లలు నిత్యం ఆడుకునే క్రికెట్ గ్రౌండ్‌ని చేతబడి వేదిక చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.

మైదానంలో పెద్ద బొమ్మని గీసి..అందులో నిమ్మకాయలు, మిరపకాయలు..వెంట్రుకలు పెట్టి ఓ నల్ల కోడిని బలి ఇచ్చారు. యథావిదిగా పొద్దున్నే గ్రౌండ్‌కి వెళ్లిన పిల్లలు వాటిని చూసి షాక్ అయ్యారు. వారు ఇంట్లో చెప్పడంతో..గ్రామస్థులంతా ఏకమయ్యి..పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు..ఎవరు ఈ పని చేసి ఉంటారనే విషయాలపై కూపీ లాగుతున్నారు. పిల్లలు ఆడుగునే ఇటువంటి ఘటనలు జరగడంతో..స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి వాటిని నిర్మూలించాలంటే పెద్ద ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేదు. గ్రామంలో చదువుకున్న యువకులు ఇద్దరో, ముగ్గురో కలిసి నాలుగు రోడ్లు కలిసే కూడళ్లలో,  గ్రౌండ్స్‌లో చిన్న సీసీ కెమెరాలు అమర్చితే సరిపోతుంది. అమావాస్య లాంటి సందర్భాలలో ఇలాంటి ఘటనలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి..నిందితులు ఈజీగా దొరికిపోతారు. అలాగని వారిపై దాడులు లాంటివి చెయ్యకూడదు. పోలీసులకు రహస్యంగా సమాచారం ఇస్తే..వారిని తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇస్తారు. ఎందుకంటే..చేతబడి, బాణామతి లాంటివి కూడా మానసిక రుగ్నతలే. టీవీ9-మెరుగైన సమాజం కోసం.

ఇది కూడా చదవండి : భార్యను కాపాడి..తాను మృత్యు ఒడిలోకి..