బీజేపీలో నిజాయితీ పరుడు ఈయనేనంటున్న రాహుల్

ఎన్నికల ప్రచారంలో నేతలు నోరు జారడం కామన్‌. కానీ ఒక్కోసారి సొంత పార్టీలకు ఇబ్బంది కలిగేలా కూడా నోరుజారుతారు. అది యాదృచ్చికమే అయినా..  ఆ తర్వాత ఆ వ్యాఖ్యలే నేతలకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. అలాంటి ఘటనే హర్యానా బీజేపీ ఎమ్మెల్యేకి ఎదురైంది. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు స్పీచ్‌ ఇస్తూ… కాస్త భయం పెట్టాలనుకున్నాడో.. లేక ఇంకేమైనానో కానీ.. ఆయన చేసిన ప్రసంగంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. అసంధ్ నియోజకవర్గంలో బీజేపీ […]

బీజేపీలో నిజాయితీ పరుడు ఈయనేనంటున్న రాహుల్
Follow us

| Edited By:

Updated on: Oct 22, 2019 | 4:25 AM

ఎన్నికల ప్రచారంలో నేతలు నోరు జారడం కామన్‌. కానీ ఒక్కోసారి సొంత పార్టీలకు ఇబ్బంది కలిగేలా కూడా నోరుజారుతారు. అది యాదృచ్చికమే అయినా..  ఆ తర్వాత ఆ వ్యాఖ్యలే నేతలకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. అలాంటి ఘటనే హర్యానా బీజేపీ ఎమ్మెల్యేకి ఎదురైంది. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు స్పీచ్‌ ఇస్తూ… కాస్త భయం పెట్టాలనుకున్నాడో.. లేక ఇంకేమైనానో కానీ.. ఆయన చేసిన ప్రసంగంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది.

అసంధ్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే బక్షిత్ సింగ్ విర్క్ ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. మీలో ఎవరు ఓటు వేసేందుకు వెళ్లినా మాకు తెలుస్తుంది. మాకు తెలియదని మీరు భావించొద్దు. మీరు ఎవరికి ఓటేశారే మేం ఇట్టే తెలుసుకోగలం. ఎందుకంటే ప్రధాని మోదీ, సీఎం ఖట్టర్ చాలా తెలివైన వారు’’ అంటూ ఆయన పంజాబీలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. అంతేకాదు మీరు ఎవరికి ఓటేసినా, అది బీజేపీ పార్టీ గుర్తుకే పడుతుందంటూ సంచలన కామెంట్లు చేశారు. దీంతో ఈసీ ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. అంతేకాదు.. ఈ వ్యాఖ్యలపై విచారణ జరిపేందుకు ఓ ప్రత్యేకాధికారిని కూడా ఈసీ నియమించింది. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీలో నిజాయితీ పరుడు బక్షిత్ సింగ్ మాత్రమే అంటూ ట్విట్టర్‌లో ఆయన ప్రసంగం వీడియోను పోస్ట్ చేశారు.

అయితే మరోవైపు ఎమ్మెల్యే బక్షిత్ సింగ్.. ఈ వీడియోలో ఉన్న మాటలు తనవి కావని.. ఎవరో ఫేక్ వీడియో పెట్టారంటూ ఆరోపించారు. ఈవీఎంలపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని స్పష్టం చేశారు. ఎవరో కావాలనే ఫేక్ వీడియో సర్క్యూలేట్ చేస్తున్నారన్నారు. వ్యక్తిగతంగా తనను, పార్టీని ఇబ్బందులు పెట్టడానికే ప్రత్యర్థులు ఇలాంటి వీడియోలను సృష్టించారని బక్షిత్ సింగ్ మండిపడ్డారు.