మూడు పార్టీల మధ్య ముప్పేట యుద్ధం.. కారణమిదే

తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్దం జోరందుకుంది. మునిసిపల్ ఎన్నికల పర్వం ముగిసిన తర్వాత ఇది మరింత ముదురుతోంది. మునిసిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని స్థాయిలో సీట్లు సాధించింది. వార్డులు, డివిజన్లలో పూర్తి మెజారిటీ సాధించని చోట్ల కూడా మునిసిపల్ ఛైర్మెన్, మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాలను టీఆర్ఎస్ దక్కించుకుంది. కో-ఆప్షన్ మెంబర్ల పేరిట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను రంగంలోకి దింపి రాజకీయ క్రీడలో పైచేయి సాధించింది. ఈ రాజకీయ చతురతే […]

మూడు పార్టీల మధ్య ముప్పేట యుద్ధం.. కారణమిదే
Follow us

|

Updated on: Jan 29, 2020 | 1:51 PM

తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్దం జోరందుకుంది. మునిసిపల్ ఎన్నికల పర్వం ముగిసిన తర్వాత ఇది మరింత ముదురుతోంది. మునిసిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని స్థాయిలో సీట్లు సాధించింది. వార్డులు, డివిజన్లలో పూర్తి మెజారిటీ సాధించని చోట్ల కూడా మునిసిపల్ ఛైర్మెన్, మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాలను టీఆర్ఎస్ దక్కించుకుంది. కో-ఆప్షన్ మెంబర్ల పేరిట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను రంగంలోకి దింపి రాజకీయ క్రీడలో పైచేయి సాధించింది.

ఈ రాజకీయ చతురతే ఇపుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు టీఆర్ఎస్ మరింతగా టార్గెట్ అయ్యేలా చేసింది. ఇందుకు ప్రధానంగా రెండు మునిసిపాలిటీలు కారణమయ్యాయని చెప్పుకోవాలి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మునిసిపాలిటీని కాంగ్రెస్ చాలా ఈజీగా కైవసం చేసుకునే ఛాన్స్ కనిపించింది. కానీ టీఆర్ఎస్ మంత్రాంగం ముందు కాంగ్రెస్ పార్టీ తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ… టెక్నికల్‌గా తెలంగాణ కోటాకు చెందిన వారంటూ కాంగ్రెస్ పార్టీ ఆయన్ను నేరేడుచర్ల మునిసిపాలిటీలో కో-ఆప్షన్ మెంబర్‌గా యాడ్ చేయించింది.

కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుపైఎత్తు వేసిన టీఆర్ఎస్.. ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డిని ఆఖరు క్షణంలో బరిలోకి దింపింది. ఆయన్ను కో-ఆప్షన్ మెంబర్‌గా యాడ్ చేయించి, నేరేడుచర్ల మునిసిపాలిటీ చైర్మెన్ పదవిని కైవసం చేసుకుంది. దాంతో కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ టీఆర్ఎస్ నేతలపై దుమ్మెత్తిపోయడం ప్రారంభించారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయపోరాటం కూడా చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

మరోవైపు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో బీజేపీ మెజారిటీ సాధించింది. అయితే.. అక్కడ కో-ఆప్షన్ మెంబర్ల సాయంతో మునిసిపల్ ఛైర్మెన్ పదవిని బీజేపీకి దక్కకుండా చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ కోటాకు చెందిన రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ నేత కే.కేశవరావును తుక్కుగూడలో కో-ఆప్షన్ మెంబర్‌గా చేర్చి.. తద్వారా మునిసిపల్ ఛైర్మెన్ పదవిని బీజేపీ నుంచి లాగేసుకుంది టీఆర్ఎస్. అయితే.. కేకేని ఏపీకి అయిదేళ్ళ క్రితమే కేటాయించినప్పటికీ ఆ మేరకు రాజ్యసభ ఎలాంటి గెజిట్ రిలీజ్ చేయలేదన్నది కేకే చెబుతున్న టెక్నికల్ పాయింట్.

రెండు చోట్ల రాజకీయ చతురత ప్రదర్శించిన టీఆర్ఎస్ పార్టీ ఇపుడు బీజేపీ, కాంగ్రెస్ నేతలకు టార్గెట్ అయ్యింది. ప్రజాస్వామ్యాన్నిపరిహసించేలా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ప్రజల తీర్పును అగౌరపరిచేలా టిఆర్ఎస్ వ్యవహారిస్తోందని అంటున్నారు. తుక్కుగూడలోని మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ నివాసంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యకర్తలతో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ బుధవారం సమావేశమయ్యారు. కేకే విషయంలో న్యాయపోరాటం చేయాలని, రాజ్యసభ ఛైర్మెన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఫిర్యాదు చేయాలని బీజేపీ నిర్ణయించింది.