బెంగాల్ లో మారని సీన్.. బీజేపీ కార్యకర్తల వినూత్న నిరసన

పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి బీజేపీ అనుబంధ విభాగమైన భారతీయ యువ మోర్చా కూడా తలనొప్పి తెఛ్చి పెడుతోంది. తమ శ్రేణులను తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు హత్య చేస్తున్నారని ఆరోపిస్తున్న బీజేపీ..ఏదో విధంగా దీదీ సర్కార్ ను ఇరకాటాన బెట్టేందుకు యత్నిస్తున్నట్టు కనబడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బహుశా ఇందులో భాగంగానే బీజేవైఎం నేతలు, కార్యకర్తలు వినూత్న నిరసనకు దిగారు. శుక్రవారాల్లో ముస్లిములు నమాజ్ పేరిట రోడ్లను ఆక్రమిస్తున్నారని, దీనివల్ల పిల్లలు తమ బడులకు వెళ్లలేక పోతున్నారని, రోగులను తీసుకువెళ్తున్న అంబులెన్సులు గంటలపాటు నిలిచిపోవలసి వస్తోందని, అలాగే అత్యవసర పనులకు వెళ్ళబోతున్నవారు కూడా మధ్యలోనే ఇబ్బందులు పడవలసి వస్తోందని ఆరోపిస్తున్న వీరు.. రోడ్ల మీదే హనుమాన్ చాలీసా పఠించడం ప్రారంభించారు. కోల్ కతా సమీపంలోని హౌరా వద్ద వారంతా ఇలా ‘ ప్రార్థనా ప్రొటెస్ట్ ‘ లకు దిగడం విశేషం. అయితే వీరి ఈ నిరసన వల్ల కూడా ప్రజలు ఇబ్బందులు పడడం ప్రారంభమైంది. దీంతో పోలీసులు వీరిని చెదరగొట్టే ప్రయత్నాలు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *