Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 24 వేల 850 మంది వైరస్​ సోకింది. మరో 613 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు2,44,814. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 4,09,083. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 19,268.
  • కోవిడ్-19 వార్ రూమ్ ఏర్పాటు చేయనున్న ఢిల్లీ సర్కారు
  • మర్డర్ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేసిన మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు. వెంకటేశ్వరరావు డిఎస్పి మిర్యాలగూడ.
  • రేపటి నుండి తెరుచుకోనున్న హైదరాబాద్లోని పలు మార్కెట్లు. బేగంబజార్ ట్రూప్ బజార్,జనరల్ బజార్ మార్కెట్లు. కరోనా భయం తో స్వచ్చందంగా షాప్స్ మూసేసి షొప్స్ యజమానులు . 10 రోజుల తరువాత రెపటినుండి యధాతధంగా నడవనున్న మార్కెట్లు.
  • విశాఖ: డీజీపీ గౌతం సవాంగ్ కామెంట్స్ పోలీస్ రోడ్ పై నిలబడి సేవచేయాలంటే కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంది కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులు విధినిర్బహణలో ఉన్నారు లాక్ డౌన్ సమయంలో ఫారెన్ రిటర్నీస్ ను సమర్ధంగా కట్టడిచేయగలిగాం -కంటైన్మెంట్ స్ట్రాటజీ పక్కాగా అమలు చేయగలిగాం వైరస్ పై ఇంకా అవగాహన పెరగాలి.. అందరూ మాస్క్ ధరించాలని చెబుతున్నాం.. అవగాహన పెంచుతున్నాం
  • రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ. లద్దాఖ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే భేటీ. సరిహద్దు ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మద్ధతు సహా పలు అంశాలపై చర్చ.

‘నా ఆరో సెన్స్ చెబుతోంది.’ మనోజ్ తివారీ

bjp will form govt. in delhi says manoj tiwari, ‘నా ఆరో సెన్స్ చెబుతోంది.’ మనోజ్ తివారీ

‘ నా మెదడులో ప్రకంపనలు, నా ఆరో సెన్స్ చెబుతున్నాయి.. ఈ సారి ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని’ అన్నారు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ.. భోజ్ పురి  నటుడు, సింగర్ కూడా అయిన ఈయన.. శనివారం తన ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆరో సెన్స్ మీద ఎవరు నమ్మకం పెట్టుకున్నా.. పెట్టుకోక పోయినా.. తనకు మాత్రం నమ్మకం ఉందని, ఈ సెన్స్ ఇదే చెబుతోందని అన్నారు. ప్రజల ఆశీస్సులతో బాటు నా తల్లి ఆశీస్సులు కూడా నాకున్నాయి. అందువల్ల బీజేపీ విజయం తథ్యం.. అని చెప్పారు. తన బర్త్ డే కి హాజరయ్యేందుకు తన తల్లి వారణాసి నుంచి ఈ నెల 1 న ఢిల్లీకి వచ్చిందని,   అప్పటి నుంచి ఉపవాసం ఉంటోందని ఆయన తెలిపారు. శనివారం పోలింగ్ ముగిసిన అనంతరమే ఆమె తిరిగి వారణాసి వెళ్తుందన్నారు. ఈ ఎన్నికల్లో తాము 50 కి మించి సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసిన తివారీ.. ప్రజల ఆశీర్వాదాలు ప్రధానిమోదీకి ఉన్నాయి గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. మీరు సీఎం అవుతారా అన్న ప్రశ్నకు.. ముసిముసి నవ్వులు నవ్వుతూ .. ఎవరో ఒక మంచి వ్యక్తి కావడం తథ్యమని చెప్పారు.

2015 లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 70 అసెంబ్లీ స్థానాలకు గాను 67 సీట్లను గెలుచుకోగా.. బీజేపీ మూడు స్థానాలను మాత్రం దక్కించుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కానీ.. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఏడు స్థానాలలోనూ విజయం సాధించింది.bjp will form govt. in delhi says manoj tiwari, ‘నా ఆరో సెన్స్ చెబుతోంది.’ మనోజ్ తివారీ

 

 

Related Tags