కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు.. మహారాష్ట్రలో రెండు మూడు నెలల్లో బీజేపీ ప్రభుత్వం…!

కేంద్ర మంత్రి రావ్‌సాహెబ్ దాన్వే పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్వరలో మహారాష్ట్ర ఉద్దవ్ ఠాక్రే సర్కార్ స్థానంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందన్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 3:52 pm, Tue, 24 November 20

కేంద్ర మంత్రి రావ్‌సాహెబ్ దాన్వే పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్వరలో మహారాష్ట్ర ఉద్దవ్ ఠాక్రే సర్కార్ స్థానంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందన్నారు. ఇప్పుడి కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల సహాయ మంత్రి రావ్‌సాహెబ్ దాన్వే పాటిల్ మహారాష్ట్రలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండుమూడు నెలల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడట ఖాయమని స్పష్టం చేశారు.

పర్భణి పట్టణంలో ఔరంగాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేంద్రమంత్రి రావ్‌సాహెబ్. భవిష్యత్‌లో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతున్నదని అన్నారు. ఆయన బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడదని అనుకోకండి… రాబోయే రెండుమూడు నెలల్లో మహారాష్ట్రలో మన ప్రభుత్వం ఏర్పడుతుందని స్పష్టమవుతోంది. దీనిని మీరు గుర్తుంచుకోండి’ అని అన్నారు. అయితే దీనికి సంబంధించిన ప్లాన్ వివరాలను ఆయన వెల్లడించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిపించి మరింత మద్దతు పలకాలన్నారు.