రేపటినుంచి బీజేపీ ‘ఒకే దేశం, ఒకే రాజ్యాంగం’

ఆర్టికల్ 370 రద్దు తర్వాత బీజేపీ కొత్త ప్రచారాన్ని ముందుకు తీసుకు రాబోతుంది. సెప్టెంబర్ 1నుంచి ‘ఓకే దేశం, ఒకే రాజ్యాంగం’ అనే పేరుతో జాతీయ ఐక్యతా ప్రచారానికి శ్రీకారం చుట్టబోతుంది. ఈ మేరకు ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధరరావు మాట్లాడుతూ ‘ఒకే దేశం, ఒకే రాజ్యాంగం’ నినాదంతో తమ పార్టీ జాతీయ ఐక్యతా ప్రచారం ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు జరగనున్న ఈ […]

రేపటినుంచి బీజేపీ  'ఒకే దేశం, ఒకే రాజ్యాంగం'
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2019 | 8:45 PM

ఆర్టికల్ 370 రద్దు తర్వాత బీజేపీ కొత్త ప్రచారాన్ని ముందుకు తీసుకు రాబోతుంది. సెప్టెంబర్ 1నుంచి ‘ఓకే దేశం, ఒకే రాజ్యాంగం’ అనే పేరుతో జాతీయ ఐక్యతా ప్రచారానికి శ్రీకారం చుట్టబోతుంది. ఈ మేరకు ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధరరావు మాట్లాడుతూ ‘ఒకే దేశం, ఒకే రాజ్యాంగం’ నినాదంతో తమ పార్టీ జాతీయ ఐక్యతా ప్రచారం ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.

సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు జరగనున్న ఈ ప్రచార కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు ఎందుకు చేయాల్సి వచ్చిందో దేశ ప్రజలకు వివరించనున్నట్టు తెలిపారు. ఈ ప్రచారంలో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్టు మురళీధరరావు చెప్పారు. ‘ఒకే దేశం, ఒకే రాజ్యాంగం’ ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈప్రచారంలో భాగంగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తారని మరళీధరరావు చెప్పారు.