జగన్‌కు బిజెపి సపోర్ట్.. సర్‌ప్రైజ్ ఇచ్చిన సోము

అప్పుడే వారిద్దరు కలిసి వున్నట్లు కనిపిస్తారు.. అప్పుడే పరస్పరం విమర్శలు చేసుకుంటారు. ఎస్ ఆ రెండు పార్టీలే వైసీపీ, బిజెపి. బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ సర్కార్‌పై ఘాటైన విమర్శలు చేస్తారు. కానీ ఆయన పార్టీ నేతలు ఒకసారి జగన్ విధానాలను విమర్శిస్తారు.. అంతలోనే చంద్రబాబుతో పోలిస్తే జగన్ బెటరంటూ మధ్యే మార్గాన మాట్లాడతారు. సరిగ్గా ఇలాంటి షాకే ఇచ్చారు బిజెపి ఏపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఏపీలో ఇపుడు ఒకవైపు ఇసుక మార్చ్‌లు […]

జగన్‌కు బిజెపి సపోర్ట్.. సర్‌ప్రైజ్ ఇచ్చిన సోము
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 11, 2019 | 6:47 PM

అప్పుడే వారిద్దరు కలిసి వున్నట్లు కనిపిస్తారు.. అప్పుడే పరస్పరం విమర్శలు చేసుకుంటారు. ఎస్ ఆ రెండు పార్టీలే వైసీపీ, బిజెపి. బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ సర్కార్‌పై ఘాటైన విమర్శలు చేస్తారు. కానీ ఆయన పార్టీ నేతలు ఒకసారి జగన్ విధానాలను విమర్శిస్తారు.. అంతలోనే చంద్రబాబుతో పోలిస్తే జగన్ బెటరంటూ మధ్యే మార్గాన మాట్లాడతారు. సరిగ్గా ఇలాంటి షాకే ఇచ్చారు బిజెపి ఏపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.

ఏపీలో ఇపుడు ఒకవైపు ఇసుక మార్చ్‌లు కొనసాగుతుంటే.. మరోవైపు కంపల్సరీ ఇంగ్లీష్ మీడియంపై రాజకీయ రగడ చెలరేగుతోంది. ఇసుక విధానంపై ఏపీ బిజెపి ప్రభుత్వం నిప్పులు చెరుగుతోంది. ఈ అంశంపై పవన్ కల్యాణ్ చేసిన లాంగ్ మార్ఛ్ కంటే ముందుగానే ఏపీ బిజెపి ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ విషయం ఆధారంగా కన్నా లక్ష్మీనారాయణ.. ఏపీ ప్రభుత్వ విధానాలపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూనే వున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారు. దాంతో కమలం పార్టీ నేతలు ఉలిక్కి పడ్డారు.

అయితే.. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత సోము వీర్రాజు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ మీడియంను కంపల్సరీ చేయడాన్ని తాను సమర్థిస్తున్నానని కుండబద్దలు కొట్టారు సోము వీర్రాజు. తన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారని, పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. అయితే.. ఇంగ్లీష్ మీడియంను కంపల్సరీ చేయడంతోపాటు.. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను కూడా ప్రోత్సహించాలన్నారు వీర్రాజు.

సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మాత్రమే సీఎం కలిశానని, ఈ సందర్భంగా రాజధాని అంశంపై ముఖ్యమంత్రికి పలు సూచనలు చేశానని అన్నారు సోము వీర్రాజు. రాష్ట్ర రాజధానికి సంబంధించి అనేక కమిటీలు వేశారు.. వాటిని ప్రజల్లోకి లోతుగా వెళ్లి.. విస్తృత స్థాయిలో చర్చలు జరపమని సూచించానని అన్నారాయన.

‘‘ రాజధాని నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం హైప్ చేసింది..క్యాపిటల్ నిర్మాణం సర్వసం అన్నట్లు ప్రచారం చేసింది.. గతంలో మూడు రాష్ట్రాలు విడిపోతే అక్కడ రాజధానులు అద్భుతంగా నిర్మించారు.. గతంలో విడిపోయిన రాష్ట్రాల్లో రాజధానులు నిర్మాణం పై ఎక్కడా ఇంత చర్చ, రచ్చ జరగలేదు.. ఇక్కడ 33 వేల ఎకరాలు తీసుకొని.. ఏడు వేల కోట్ల ఖర్చు చేశారు.. ఏమి కట్టారో కూడా స్పష్టత లేదు.. ప్రతి నెల 60 కోట్లు అద్దెలు కడుతున్నారు.. ఐదేళ్లలో ఎంత ఖర్చు అయ్యిందో.. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి, గతంలో హైదరాబాద్ తరహా అభివృద్ధి కేంద్రీకృత వద్దని విషయం చెప్పాను.. విద్య, వైద్యం మరింత అభివృద్ధి కోసం ఎలాంటి సేవలు అవసరం చెప్పాను.. విద్య, వైద్యంలో భారీ అవినీతి ఉంది.. అవినీతిని అరికట్టమని చెప్పాను.. ఆ శాఖల్లో అనాదిగా జరుగుతోంది.. విద్య, వైద్యం కోసం దాదాపు 1.50 లక్షల కోట్లు ఖర్చు చేయడం గొప్ప విషయం..ఇందులో అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలని చెప్పాను.. అవసరమైన మేరకు అమరావతి నిర్మాణం చేయండి.. మిగిలిన భూములను సద్వినియోగం చేసుకోవాలి.. ’’ ఇలా చాలా అంశాల్లో కుండబద్దలు కొట్టారు సోము వీర్రాజు.

సీఎంను కల్వగానే తాను పార్టీ మారతానన్నట్లుగా ప్రచారం చేస్తారని, తాను మాత్రం మరణించే దాకా బిజెపిలోనే వుంటానని తేల్చి చెప్పారుు సోము వీర్రాజు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!