బిజెపి ‘మహా’ వ్యూహం.. అదే జరిగితే ‘సేన’ ఖతమేనా ?

మెరుగైన ఫలితాలు పొందినప్పటికీ మహారాష్ట్ర సీఎం సీటుకు దూరమైన భారతీయ జనతా పార్టీ.. శివసేన నమ్మక ద్రోహానికి ప్రతీకారం తీర్చుకునే దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు చేస్తోందా ? లోతుగా ఆలోచిస్తే అంతేనంటున్నారు రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భంగపడిన దానికంటే.. ప్రతిపక్షంలో కూర్చోవాలన్న తెలివైన నిర్ణయాన్ని బిజెపి నేతలు చేశారంటున్నారు పరిశీలకులు. ఇంతకీ బిజెపి అనుసరించబోతోన్న దీర్ఘకాలిక వ్యూహం ఏంటి ? రీడ్ దిస్ స్టోరీ.. 288 మంది శాసనసభ్యులున్న మహారాష్ట్ర శాసనసభలో బిజెపినే […]

బిజెపి ‘మహా’ వ్యూహం.. అదే జరిగితే ‘సేన’ ఖతమేనా ?
Follow us

| Edited By:

Updated on: Nov 11, 2019 | 2:16 PM

మెరుగైన ఫలితాలు పొందినప్పటికీ మహారాష్ట్ర సీఎం సీటుకు దూరమైన భారతీయ జనతా పార్టీ.. శివసేన నమ్మక ద్రోహానికి ప్రతీకారం తీర్చుకునే దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు చేస్తోందా ? లోతుగా ఆలోచిస్తే అంతేనంటున్నారు రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భంగపడిన దానికంటే.. ప్రతిపక్షంలో కూర్చోవాలన్న తెలివైన నిర్ణయాన్ని బిజెపి నేతలు చేశారంటున్నారు పరిశీలకులు. ఇంతకీ బిజెపి అనుసరించబోతోన్న దీర్ఘకాలిక వ్యూహం ఏంటి ? రీడ్ దిస్ స్టోరీ..

288 మంది శాసనసభ్యులున్న మహారాష్ట్ర శాసనసభలో బిజెపినే ఇప్పుడు అతిపెద్ద పార్టీ. 105 ఎమ్మెల్యేలతో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే.. ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసిన శివసేన నెంబర్ గేమ్‌లో కీలకంగా మారి.. చివరికి కోర్కెల చిట్టాతో బిజెపి నేతలను చిరాకెత్తించారు. ఎన్నికలకు ముందు కుదరిన అవగాహన ప్రకారమే సీఎం సీటు అడిగామని చెబుతున్నా శివసేన.. ఫలితాలు రాగానే ఎందుకు ముందుగా సీఎం సీటు అంశాన్ని లేవనెత్తింది అన్నది థాక్రేకు, సంజయ్ రౌత్‌లకే తెలియాలి. ఒకవేళ ముందస్తు అవగాహనే వుంటే.. సహజంగానే మిత్రపక్ష నేతలతో కూర్చుని మాట్లాడుకోవచ్చు.. కానీ ఫలితాలొకవైపు వెలువడుతుండగానే సంజయ్ రౌత్ సీఎం సీటు పంపకంపై బహిరంగ ప్రకటనతో పేచీ ప్రారంభించారు.

ముందుగా రౌత్‌తో మాట్లాడించిన శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే.. ఆ తర్వాత తానే స్వయంగా ప్రకటనలివ్వడం ప్రారంభించారు. రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. రిమోట్ తమ చేతిలోనే వుందనే స్థాయికి వెళ్ళారు ఉద్దవ్ థాక్రే. ఈ నేపథ్యంలోనే తాను డమ్మీని కాబోనని చాటుకున్నారు సిట్టింగ్ సీఎం దేవంద్ర ఫడ్నవీస్. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాం కానీ.. శివసేన తాటాకు చప్పుళ్ళకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు. దాంతో పలు మార్లు భేటీ అయిన స్టేట్, సెంట్రల్ బిజెపి లీడర్లు.. ప్రభుత్వ ఏర్పాటు నుంచి దూరం జరగాలని.. ఆ తర్వాత జరిగే పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని నిర్ణయించారు.

శివసేనకున్నది 56 ఎమ్మెల్యే సీట్లు.. దాదాపు 10 మంది వరకు ఇండిపెండెంట్లు మద్దతు ఇస్తున్నారని శివసేన చెప్పుకుంటోంది. అయినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145ను చేరుకోవాలంటే శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మద్దతు అడగాల్సిందే.. అయితే.. ముందుగా శివసేన ఎన్డీయే నుంచి బయటికి వస్తే.. మద్దతు విషయం చూస్తామని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శివసేన అధినేత ఉద్దవ్ థాక్రేకి షరతు విధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఎన్డీఏ కేబినెట్‌లో వున్న అరవింద్ సావంత్ తన పదవికి సోమవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే.. కేవలం 56 మంది ఎమ్మెల్యేలతో.. ఎన్సీపీ (54), కాంగ్రెస్ పార్టీ (44) మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. శివసేన ప్రభుత్వం మహారాష్ట్రలో ఇప్పటి వరకు ఏర్పడిన అత్యంత బలహీనమైన సర్కార్‌గా చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. అయితే.. బయటి నుంచి మద్దతు తీసుకోకుండా.. ప్రభుత్వంలో భాగస్తులు కావాలని శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలను కోరుతోంది. ఈ రకంగా సీఎం పదవి శివసేన తీసుకుని, ఒక్కో డిప్యూటీ సీఎం పదవి ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు ఇవ్వచూపుతోంది. ఇదే జరిగితే.. హిందుత్వ ఎజెండాతోనే రాజకీయం చేసే శివసేనతో కాంగ్రెస్ పార్టీ కలిస్తే.. అది దేశవ్యాప్తంగా ప్రభావం చూపనుంది.

ఎన్నికల ప్రచారంలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలను ఎండగట్టిన శివసేన వారితో కల్వడం బిజెపికి రాజకీయంగా పెద్ద అస్త్రం దొరకనుంది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు తమ కలయికను ఏ ప్రాతిపదికన జనంలో సమర్థించుకోగలరన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని మహారాష్ట్రలో ఏకైక హిందుత్వ పార్టీగా బిజెపి నిలిచేందుకు వ్యూహం తప్పనుంది.

కర్నాటకలో తక్కువ సీట్లున్న జెడిఎస్ పార్టీకి సీఎం సీటిచ్చి చేసిన ప్రయోగం విఫలమైనా కూడా కాంగ్రెస్.. శివసేనకు మద్దతిస్తే.. ఏడాదిలోగా ప్రభుత్వం మారడమో.. ప్రభుత్వం కూలిపోవడమో జరుగుతుందని బిజెపి భావిస్తోంది. అదే జరిగితే.. మళ్ళీ ఎన్నికలోస్తే.. శివసేన చేసిన నమ్మక ద్రోహాన్ని, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీల అపవిత్ర కలయిక ఆసరాగా జనం ముందుకు వెళ్ళి ప్రచారం చేయడం ద్వారా భారీగా లాభపడవచ్చన్నది బిజెపి వ్యూహంగా కనిపిస్తోంది. నిజానికి ఆర్టికల్ 370 రద్దుతో బిజెపికి పెరిగిన ఇమేజీని శివసేన షేర్ చేసుకుందని, బిజెపి పోటీ చేసిన చాలా చోట్ల శివసేన ముందస్తు వ్యూహంతోనే సరిగ్గా సహకరించలేదని బిజెపి నేతలు విశ్వసిస్తున్నారు.

పొత్తు లేకుండా బిజెపి ఎన్నికల బరిలోకి దిగితే.. సొంతంగా మెజారిటీ సాధించేదని, దాన్ని అడ్డుకునేందుకు తమపై డిపెండ్ అయ్యేలా చేసుకునేందుకే శివసేన అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొత్తు నాటకాన్ని ఆడిందన్న అంశంతో జనంలోకి వెళ్ళాలని బిజెపి నేతలు భావిస్తున్నారు. శివసేన నేతలు అధికారం కోసం మిత్ర ధర్మాన్ని విస్మరించారన్నది కమలం నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు విముఖత చూపి.. ఆ తర్వాత జరిగే తంతుతో లాభపడాలన్నది బిజెపి వ్యూహమని తెలుస్తోంది.

మీరు సకాలంలో గృహ రుణం చెల్లించకపోతే మీ ఇంటిని ఎన్ని రోజులకు సీజ్‌
మీరు సకాలంలో గృహ రుణం చెల్లించకపోతే మీ ఇంటిని ఎన్ని రోజులకు సీజ్‌
ప్రియదర్శి, నభా నటేష్ మధ్య డార్లింగ్ పంచాయితీ. రీతూవర్మ రియాక్షన్
ప్రియదర్శి, నభా నటేష్ మధ్య డార్లింగ్ పంచాయితీ. రీతూవర్మ రియాక్షన్
వ్యాపారంలో ఇబ్బందులా.. ఈ రోజు సాయంత్రం ఈ చిన్న పరిష్కారం చేయండి
వ్యాపారంలో ఇబ్బందులా.. ఈ రోజు సాయంత్రం ఈ చిన్న పరిష్కారం చేయండి
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా..
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా..
ఇట్స్ అఫీషియల్.. టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఇట్స్ అఫీషియల్.. టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
నల్లగొండ నేతల మధ్య 'పవర్' ఫుల్ డైలాగ్ వార్.. దీని చుట్టే రాజకీయం
నల్లగొండ నేతల మధ్య 'పవర్' ఫుల్ డైలాగ్ వార్.. దీని చుట్టే రాజకీయం
భార్య బౌలింగ్.. భర్త బ్యాటింగ్.. 6 బంతుల్లో 36 పరుగుల ఛాలెంజ్
భార్య బౌలింగ్.. భర్త బ్యాటింగ్.. 6 బంతుల్లో 36 పరుగుల ఛాలెంజ్
ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో తెలంగాణ ఆడపడుచు..!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో తెలంగాణ ఆడపడుచు..!
ఇదెక్కడి విడ్డూరం బాబోయ్.! ఒక్క ఓటరు.. రెండు రాష్ట్రాల్లో ఓటు..
ఇదెక్కడి విడ్డూరం బాబోయ్.! ఒక్క ఓటరు.. రెండు రాష్ట్రాల్లో ఓటు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు